‘ఆచార్య’ నుంచి మరో న్యూ పిక్‌ - ram charan on sets of acharya
close
Published : 01/03/2021 17:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ఆచార్య’ నుంచి మరో న్యూ పిక్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘ఆచార్య’. రామ్‌ చరణ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. కామ్రేడ్‌ ‘సిద్ధ’గా కనిపించనున్నారాయన. ప్రస్తుతం చిత్రీకరణలో ఉందీ సినిమా . ఇద్దరి కలయికలో వచ్చే ఓ సన్నివేశానికి సంబంధించిన ఫొటోను సామాజిక మాధ్యమాల వేదికగా తాజాగా అభిమానులతో పంచుకున్నారు దర్శకుడు. ఇందులో రామ్‌ చరణ్‌ భుజంపై వేసిన చిరంజీవి చేయి కనిపిస్తుంది. ‘ఆచార్య సిద్ధమవుతున్నాడు’ అంటూ శివ ట్వీట్‌ చేయగా.. ‘ఇది కామ్రేడ్‌ సమయం! ఆచార్య సెట్‌లో నాన్న(చిరంజీవి), కొరటాల శివతో ప్రతిక్షణం ఆనందిస్తున్నా’ అని తెలిపారు రామ్‌ చరణ్‌.

ఈ చిత్రంలో చిరంజీవి సరసన కాజల్‌ నటిస్తుంది. మ్యాట్నీ ఎంటర్‌టైన్స్‌, కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ సంస్థలు నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. మే 13న విడుదలవుతుందీ సినిమా. ఇటీవలే విడుదలైన టీజర్‌ సినిమాపై అంచనాలు పెంచుతోంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని