తారక్‌ హోస్ట్‌గా.. చరణ్‌ గెస్ట్‌గా..! - ram charan will be a guest on tarak hosting show
close
Updated : 16/07/2021 06:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తారక్‌ హోస్ట్‌గా.. చరణ్‌ గెస్ట్‌గా..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: అవును.. మీరు అనుకుంటున్నదాని గురించే చెప్పబోతున్నాం. ఓ ప్రముఖ తెలుగు ఛానల్‌లో ప్రసారం కాబోయే ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమానికి జూనియర్‌ ఎన్టీఆర్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఆ కార్యక్రమ షూటింగ్‌ కూడా ఇప్పటికే మొదలైంది. ఎన్టీఆర్‌ ఆ పనుల్లో బిజీగా సమయం గడుపుతున్నారు. ఆ కార్యక్రమానికి గెస్ట్‌గా మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ హాజరుకానున్నట్లు తెలుస్తోంది. అయితే.. అధికారికంగా ఈ విషయాన్ని ధ్రువీకరించలేదు. అయినా.. ఈ వార్త నిజమయ్యే అవకాశాలు మెండుగానే కనిపిస్తున్నాయి. ఎందుకంటే.. తారక్‌, రామ్‌చరణ్‌ ఇద్దరూ కలిసి రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో నటిస్తున్న విషయం తెలిసిందే. చిత్రీకరణ చివరి దశలో ఉన్న ఆ సినిమా అక్టోబర్‌ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే చరణ్‌ ఈ కార్యక్రమంలో హాట్‌సీట్లో కూర్చొని సందడి చేయబోతున్నారని తెలుస్తోంది. అంతేకాదు తొలి ఎపిసోడ్‌లోనే ఈ ఇద్దరూ కనులవిందు చేయబోతున్నారట. ఇదే నిజమైతే ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా అటు తమ చిత్రం.. ఇటు ఈ కార్యక్రమానికి ప్రమోషన్‌ చేసినట్లవుతుంది. ఇదంతా దృష్టిలో పెట్టుకొని ఒకరోజు ఎపిసోడ్‌లో చరణ్‌ను అతిథిగా ఆహ్వానించాలని ఆ కార్యక్రమ నిర్వాహకులు భావిస్తున్నారట. ఇప్పటికే చరణ్‌ కాల్‌లిస్టులో ఈ కార్యక్రమం కోసం ఒక తేదీని మార్కు చేసినట్లు సినీ వర్గాల్లో టాక్‌. ఏదేమైనా బుల్లితెరపై తారక్‌, చరణ్‌ కలిసి సందడి చేస్తే తెలుగు ప్రేక్షకులకు కావాల్సినంత వినోదం దొరకడం మాత్రం పక్కా.

మరోవైపు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రబృందం ప్రచార కార్యక్రమాల కోసం సిద్ధమవుతోంది. సుమారు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌, కొమురంభీమ్‌గా తారక్‌ సందడి చేయనున్నారు. ఆలియాభట్‌, ఒలీవియా మోరీస్‌, అజయ్‌ దేవ్‌గణ్‌, సముద్రఖని, శ్రియ, తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని