‘జాతిరత్నాలు’ దర్శకుడితో రామ్ చిత్రం? - ram film with jatiratnalu director
close
Updated : 13/04/2021 14:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘జాతిరత్నాలు’ దర్శకుడితో రామ్ చిత్రం?

ఇంటర్నెట్ డెస్క్: ఈ మధ్యే విడుదలైన తెలుగు సినిమా 'జాతిరత్నాలు'. కె.వి.అనుదీప్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. దీంతో దర్శకుడు అనుదీప్‌కి పలు అవకాశాలు వస్తున్నాయి. తాజాగా ‘రెడ్‌’ హీరో రామ్‌తో ఓ సినిమా చేయనున్నాడనే సినీ వర్గాలు టాక్‌ వినిపిస్తోంది. ఇప్పటికే కథకు సంబంధించి రామ్‌ కూడా ఓకే అనేశాడని చెప్పుకుంటున్నారు. మాస్ మసాలా ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాని వైజయంతీ మూవీస్ సహకారంతో స్రవంతి మూవీస్‌ నిర్మించనుంది.  త్వరలోనే చిత్రానికి సంబంధించి మరిన్ని విషయాలు బయటకు రానున్నాయి. ఇప్పటికే రామ్‌ - లింగు స్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. కృతి శెట్టి కథానాయికగా నటిస్తోంది. శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని