వర్మ దర్శకత్వంలో మరోసారి అమితాబ్‌! - ram gopal varma and amitabh bachchan to team up
close
Published : 05/06/2021 22:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వర్మ దర్శకత్వంలో మరోసారి అమితాబ్‌!

ఇంటర్నెట్‌ డెస్క్: బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌, వివాదస్పద దర్శకుడు రాంగోపాల్‌ వర్మ పేరు చెప్పగానే గుర్తుకొచ్చే చిత్రం ‘సర్కార్‌’. 2005లో పొలిటికల్‌ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంగా వచ్చిన ఈ చిత్రంలో అమితాబ్ ప్రధాన పాత్ర పోషించగా అభిషేక్ బచ్చన్,  కోట శ్రీనివాసరావు, అనుపమ్ ఖేర్ ఇతర పాత్రల్లో నటించి అలరించారు. ఈ సినిమాకి సీక్వెల్‌గా ‘సర్కార్ రాజ్‌’, (2008) ‘సర్కార్‌ 3’ (2017) విడుదలై మెప్పించాయి. తాజాగా అమితాబ్‌ - రామ్‌ కలిసి ఓ సినిమా చేయనున్నారని సమాచారం. రామ్‌ గత కొన్ని సంవత్సరాలు సినిమాకోసం స్క్రిప్టు సిద్ధం చేశారట. ఇందులోని ప్రధాన పాత్రకోసం అమితాబ్‌ని సంప్రదించారు. రామ్ చెప్పిన కథ నచ్చడంతో అమితాబ్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని సమాచారం. ప్రస్తుతం దావూద్‌ ఇబ్రహీం జీవితం ఆధారంగా తెరకెక్కించే వెబ్‌ సీరీస్‌లో వర్మ బిజీగా ఉన్నారు. ఈ సీరీస్‌ పూర్తయ్యాక అమితాబ్‌ నటించే సినిమా పనులు మొదలు పెట్టే యోచనలో ఉన్నాడట. మరో వైపు అమితాబ్‌  ‘డెడ్లీ’, ‘ది ఇంటర్న్’తో పాటు మరికొన్ని హిందీ సినిమాల్లో నటిస్తున్నారు. మొత్తంమీద వచ్చే ఏడాదిలో వర్మ - అమితాబ్‌ల చిత్రం సెట్స్‌ పైకి వెళ్లనుందని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని