ఆక్సిజన్‌ కొరత.. రామజన్మభూమి ట్రస్ట్‌ సాయం   - ram janmabhoomi teerth kshetra has decided to provide funds for installation of 2 oxygen plants
close
Published : 23/04/2021 01:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆక్సిజన్‌ కొరత.. రామజన్మభూమి ట్రస్ట్‌ సాయం  

అయోధ్య: దేశంలో కరోనా ఉరుముతున్న వేళ ఆక్సిజన్‌ కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఈ నేపథ్యంలో అయోధ్యలోని రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. అయోధ్య  నగరంలోని దశరథ్‌ వైద్య కళాశాలలో రెండు ఆక్సిజన్‌ ప్లాంట్‌ల ఏర్పాటుకు నిధులు సమకూర్చాలని నిర్ణయించింది. ఈ ప్లాంట్‌లతో ఆస్పత్రిలో ఆక్సిజన్‌ కొరతను తీర్చేందుకు దోహదపడుతుందని తెలిపింది. 

నాసిక్‌ విషాదం ఎలా జరిగింది? : బాంబే హైకోర్టు
ముంబయి: మహారాష్ట్రలోని నాసిక్‌లో నిన్న జరిగిన ప్రమాదంతో సకాలంలో ఆక్సిజన్‌ అందక 24మంది కొవిడ్ రోగుల మరణంపై బాంబే హైకోర్టు విచారించింది. ఈ విషాదంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక కోరింది. నాసిక్‌లోని జకీర్‌ హుస్సేన్‌ మున్సిపల్‌ ఆస్పత్రి ఆవరణలోని స్టోరేజీ ప్లాంట్‌ నుంచి ఆక్సిజన్‌ లీకై పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటన అందరినీ కలచివేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపాంకర్‌ దత్తా, జస్టిస్‌ జీఎస్‌ కులకర్ణితో కూడిన ధర్మాసనం ఈ ఘటన ఎలా జరిగిందో తెలుపుతూ మే 4కల్లా నివేదిక ఇవ్వాలని ఏజీ అశుతోష్‌ కుంభకోణిని ఆదేశించింది. విచారణ సందర్భంగా నాసిక్‌ స్థానిక అధికారులు సీఎస్‌కు పంపిన ప్రాథమిక నివేదిక ఆధారంగా వివరాలను ఏజీ కోర్టుకు తెలిపారు. ప్రైవేటు సంస్థ తైయో నిప్పన్‌ సాన్సో కార్పొరేషన్‌తో ఒప్పందం ఆధారంగా ఆస్పత్రి వద్ద ఆక్సిజన్‌ ట్యాంక్‌ ఏర్పాటు చేశారని తెలిపారు. ట్యాంకు నింపడం, నిర్వహణ ఆ సంస్థదే బాధ్యతని పేర్కొంటూ ఈ విషాదానికి కారణాలను ఆయన కోర్టుకు వివరించారు. అయితే, అఫిడవిట్ రూపంలో సవివరమైన నివేదికను సమర్పించాలని న్యాయస్థానం ఏజీని ఆదేశించింది.

సాయంత్రం 6గంటలకే షాపులు బంద్‌!
దేశంలో కరోనా వైరస్‌ తుపానులా విరుచుకుపడుతుండటంతో హరియాణా ప్రభుత్వం మరిన్ని కఠిన నిర్ణయలు తీసుకుంది. కరోనాకు కళ్లెం వేయడమే లక్ష్యంగా రేపు సాయంత్రం 6గంటలకు ముందే అన్ని దుకాణాలను (అత్యవసర దుకాణాలు మినహా) మూసివేయాలని ఆదేశించింది. ఈ మేరకు హరియాణా హోంమంత్రి అనిల్‌ విజ్‌ ట్విట్‌ చేశారు. ప్రజలు గుమిగూడటంపై నిషేధం విధించారు. ఎవరైనా వేడుకలు నిర్వహించాలనుకుంటే  అధికారుల నుంచి అనుమతులు తీసుకోవాలని సూచించారు. ఈ కొత్త నిబంధనలు శుక్రవారం నుంచి అమలులోకి వస్తాయని మంత్రి తెలిపారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని