రామ్‌.. దేవిశ్రీ ఏడోసారి - ram pothineni devi sri combination works again
close
Updated : 15/04/2021 19:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రామ్‌.. దేవిశ్రీ ఏడోసారి

ఇంటర్నెట్‌ డెస్క్‌: రామ్ పోతినేని కథానాయకుడిగా రాబోయే సినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ మరోసారి సంగీతం అందించనున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో ఆరు చిత్రాలు రావడం విశేషం. జగడం, రెడీ, శివం, ఉన్నది ఒకటే జిందగీ, నేను.. శైలజ..., హలో గురు ప్రేమకోసమే.. చిత్రాలకు డీఎస్పీ బాణీలు సమకూర్చారు. తాజాగా మరోసారి ఈ ఇద్దరూ కలిసి ఏడో చిత్రానికి పనిచేయనున్నారు. రామ్‌ 19వ చిత్రాన్ని లింగుస్వామి నిర్మిస్తున్నారు. రాపో సరసన ‘ఉప్పెన’ చిన్నది కృతిశెట్టి హీరోయిన్‌గా సందడి చేయనుంది. శ్రీనివాస సిల్వర్‌స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాస చిత్తూరి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా వస్తున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు లింగుస్వామి ‘పందెం కోడి’, ‘ఆవారా’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కాగా.. ఇటీవల ‘రెడ్‌’ చిత్రంతో మంచి విజయం సాధించిన రామ్‌ నుంచి వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని