రామ్‌ ‘రెడ్‌’ మూవీ రిలీజ్‌ ఫిక్స్‌ - ram pothineni starrer RED movie will come on this sankranthi
close
Published : 21/12/2020 18:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రామ్‌ ‘రెడ్‌’ మూవీ రిలీజ్‌ ఫిక్స్‌

హైదరాబాద్‌: యువ కథానాయకుడు రామ్ ద్విపాత్రాభినయం చేస్తున్న చిత్రం ‘రెడ్‌’. నివేదా పేతురాజు, మాళవిక శర్మ, అమృత అయ్యర్‌ కథానాయికలు. కిషోర్‌ తిరుమల దర్శకుడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ ఏడాది ఏప్రిల్‌లోనే విడుదల కావాల్సి ఉంది. అయితే, కరోనా, లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడింది. ప్రముఖ ఓటీటీలో ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు వార్తలు వచ్చినా వాటిపై చిత్ర బృందం స్పందించలేదు. తాజాగా ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 24న థియేట్రికల్‌ ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు.

గతంలో తన చిత్రాలు ‘దేవదాస్’‌, ‘మస్కా’, సంక్రాంతి కానుకగా వచ్చి ప్రేక్షకులను మెప్పించాయని, తాజాగా ‘రెడ్‌’ను కూడా పెద్ద పండగకు తీసుకొస్తున్నట్లు కథానాయకుడు రామ్‌ తెలిపారు. తమ చిత్రం ద్వారా మరోసారి ప్రేక్షకులకు థియేటర్‌ అనుభూతిని పంచేందుకే ఇంతకాలం ఆగినట్లు పేర్కొన్నారు. రామ్‌ నుంచి అభిమానులు, ప్రేక్షకులు ఏం కోరుకుంటారో ఈ చిత్రంతో అవన్నీ లభిస్తాయని నిర్మాత స్రవంతి రవికిషోర్‌ తెలిపారు. మణిశర్మ అందించిన పాటలు ఇప్పటికే ఎంతో పాపులర్‌ అయ్యాయని థియేటర్‌లో అవి మరింత అలరిస్తాయని అన్నారు. తమిళంలో ఘన విజయం సాధించిన ‘తడమ్‌’ చిత్రానికి రీమేక్‌గా ‘రెడ్‌’ తెరకెక్కుతోంది. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ తర్వాత రామ్‌ నుంచి వస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి.
మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని