పోలీస్‌ అధికారిగా నటించనున్న రామ్‌? - ram pothineni to play a cop in lingusamy movie
close
Published : 03/04/2021 12:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పోలీస్‌ అధికారిగా నటించనున్న రామ్‌?

ఇంటర్నెట్‌ డెస్క్: రామ్‌ కథానాయకుడిగా లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. కృతి శెట్టి కథానాయిక. శ్రీనివాసా సిల్వర్ స్ర్కీన్‌ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రంలో రామ్‌ పవర్‌పుల్‌ పోలీస్‌ అధికారి పాత్రలో నటించనున్నాడట. పవన్‌ కుమార్‌ సమర్పణలో ‘రాపో 19’ వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రం యాక్షన్‌ ఎంటర్‌టైన‌ర్‌ అలరించడంతో పాటు, సామాజిక సందేశాన్ని అందివ్వనుందట.

శ్రీనివాసా చిట్టూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సినిమా తెలుగు - తమిళంలో ద్విభాషా చిత్రంగా తెరకెక్కనుంది. వచ్చే ఏడాది ఆరంభంలోనే సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు నిర్మాణ సంస్థ యోచిస్తున్నట్లు సమాచారం.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని