తప్పులు సహజం: రామ్ - ram tweets on online trolls related to red pre release event
close
Published : 13/01/2021 12:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తప్పులు సహజం: రామ్

ఆన్‌లైన్‌ ట్రోల్స్‌కు హీరో రిప్లై

హైదరాబాద్‌: ఇస్మార్ట్‌ హీరో రామ్‌ పోతినేని కథానాయకుడిగా తెరకెక్కిన కమర్షియల్‌, లవ్‌ ఎంటర్‌టైనర్‌ ‘రెడ్‌’. తమిళంలో సూపర్‌ హిట్‌గా నిలిచిన ‘తడమ్‌’ రీమేక్‌గా ఈసినిమా రానుంది. కిషోర్‌ తిరుమల దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ‘రెడ్‌’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ హైదరాబాద్‌లో వేడుకగా జరిగింది. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈ ఈవెంట్‌ చివర్లో ‘రెడ్‌’ సినిమా టికెట్‌కు బదులు ‘క్రాక్‌’ మూవీ టికెట్‌ను చిత్రబృందం ఆవిష్కరించింది. అది గమనించిన పలువురు నెటిజన్లు సోషల్‌మీడియా వేదికగా ‘రెడ్‌’ టీమ్‌, ఈవెంట్‌ ఆర్గనైజేషన్‌ను ట్రోల్‌ చేస్తున్నారు.

కాగా, తాజాగా ఆన్‌లైన్‌లో వస్తోన్న ట్రోల్స్‌పై నటుడు రామ్‌ స్పందించారు. తప్పులు జరగడం సహజమని తెలిపారు. ‘‘రెడ్‌’ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా విచ్చేసిన త్రివిక్రమ్‌కి ధన్యవాదాలు. నాకెంతో ఇష్టమైన అభిమానులను ఎంతోకాలం తర్వాత ఈవెంట్‌లో చూడడం ఎప్పటిలాగే ఆనందంగా ఉంది. అప్పుడప్పుడు తప్పులు జరుగుతాయి. ఏం పర్వాలేదు. శ్రేయస్‌ మీడియా.. మీరు ఎప్పటికీ బెస్ట్‌.!!’ అని రామ్‌ ట్వీట్‌ చేశారు.

స్రవంతి రవికిషోర్‌ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాలో రామ్‌ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారు. అలాగే రామ్‌ సరసన మాళవికా శర్మ, అమృతా అయ్యర్‌, నివేదా పేతురాజ్‌ సందడి చేయనున్నారు. నటి హెబ్బాపటేల్‌ ఈ సినిమాలో ఓ ప్రత్యేక గీతంలో సందడి చేయనున్నారు.

ఇదీ చదవండి

ఈసారి మంట మామూలుగా ఉండదు: రామ్‌
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని