ఏ హీరోయిన్‌కి ఈ వెల్‌కమ్‌ దొరకలేదు: రామ్‌చరణ్‌ - ramcharan about kritishetty performance in uppena
close
Published : 18/02/2021 10:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఏ హీరోయిన్‌కి ఈ వెల్‌కమ్‌ దొరకలేదు: రామ్‌చరణ్‌

హైదరాబాద్‌: ‘ఉప్పెన’ కథానాయిక కృతిశెట్టి తొలి సినిమాతోనే ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్‌ సంపాదించుకుందని కథానాయకుడు, మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ అన్నారు. ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ శిష్యుడు బుచ్చిబాబు డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘ఉప్పెన’ బ్లాక్‌బస్టర్‌ సెలబ్రేషన్స్‌ తాజాగా రాజమహేంద్రవరంలో జరిగాయి. ఈ విజయోత్సవ వేడుకకు రామ్‌చరణ్‌ తేజ్‌ ముఖ్యఅతిథిగా విచ్చేసి చిత్రబృందాన్ని అభినందించారు. అనంతరం ఆయన కృతిశెట్టిపై ప్రశంసల వర్షం కురిపించారు. కృతి నటన అద్భుతంగా ఉందని పేర్కొన్నారు.

‘మీ బేబమ్మ.. అదోలా యాక్టింగ్‌ చేసింది. కృతి.. నీ నటనతో మా అందరి హృదయాలు గెలుచుకున్నావు. ఈ ఫంక్షన్‌లో మా కుర్రోళ్లందరూ ఇంత రెచ్చిపోతున్నారంటే కొంత బేబమ్మ వల్లే అని అర్థం అవుతోంది. ఇటీవల కాలంలో ఓ కొత్త హీరోయిన్‌కి ఇంత గ్రాండ్‌ వెల్‌కమ్‌ నేను చూడలేదు. కెరీర్‌లో ఆమె ఎన్నో ఉన్నతశిఖరాలకు వెళ్లాలని ఆశిస్తున్నాను. భవిష్యత్తులో ఆమె డేట్స్‌ దొరకడం కూడా కష్టం కావొచ్చు’ అని చరణ్‌ కొనియాడారు.

ఇదే కార్యక్రమంలో కృతిశెట్టి మాట్లాడుతూ రామ్‌చరణ్‌కు తానో పెద్ద అభిమానినని అన్నారు. ‘‘ఉప్పెన’ చిత్రాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. ఈ వేదికపై ఎంతో మంది ఉండగా చరణ్‌ సర్‌ మాత్రమే నాకు కనిపిస్తున్నారు. ఆయనంటే నాకు ఎంతో ఇష్టం. ఆయనకు వీరాభిమానిని. ‘రంగస్థలం’లో ఆయన నటన అద్భుతంగా ఉంది’’ అని కృతిశెట్టి అన్నారు.

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని