RamCharan: డేట్‌కి వెళ్లిన చెర్రీ- ఉపాసన - ramcharan and upasana going to lunch date
close
Updated : 08/07/2021 06:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

RamCharan: డేట్‌కి వెళ్లిన చెర్రీ- ఉపాసన

ఇంటర్నెట్‌ డెస్క్‌: రామ్‌చరణ్‌, ఉపాసన దంపతులు ఇప్పుడు డేట్‌కి వెళ్లడమేంటి? ఇదే కదా మీ సందేహం. మరేం లేదండి.. తమ తమ పనులతో ఎప్పుడూ బిజీగా ఉండే ఈ జంట వాటికి కాస్త విరామం ఇచ్చి సరదాగా గడపాలనుకున్నారేమో! అందుకే వీకెండ్‌ కాకపోయినా ‘మిడ్‌ వీక్‌’ అంటూ బుధవారం ఓ రెస్టారెంట్‌కి వెళ్లారు. అక్కడ నోరూరించే వంటకాల్ని ఆస్వాదించేందుకు సిద్ధమయ్యారు. ఆ రెస్టారెంట్‌లో దిగిన ఫొటోని సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకున్నారు ఉపాసన. ఇద్దరూ ఓ టేబుల్‌ దగ్గర కూర్చుని చిరు నవ్వులు చిందిస్తూ కనిపించారు. వైట్‌ షర్ట్‌లో చెర్రీ, రెడ్‌ డ్రెస్‌లో ఉపాసన లుక్‌ ఆకట్టుకుంటోంది. ఈ ఫొటోకి ‘లంచ్‌ బ్రేక్‌.. లంచ్‌ డేట్‌’ అనే వ్యాఖ్యని జతచేశారు ఉపాసన. అది ఎక్కడనేది మాత్రం చెప్పలేదు. ఇదీ సంగతి.

ప్రస్తుతం రామ్‌ చరణ్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా దర్శనమివ్వనున్నారు. జూనియర్‌ ఎన్టీఆర్‌ మరో కథానాయకుడు. రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం రెండు పాటలు మినహా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ సినిమా పూర్తయ్యాక తమిళ ప్రముఖ దర్శకుడు శంకర్‌తో ఓ చిత్రం చేయనున్నారు చరణ్‌.  

 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని