Allu Arjun: బన్నీకి చరణ్‌ గ్రీటింగ్‌ కార్డ్‌ - ramcharan sends spl msg to bunny
close
Published : 09/05/2021 16:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Allu Arjun: బన్నీకి చరణ్‌ గ్రీటింగ్‌ కార్డ్‌

స్పెషల్‌ మెసేజ్‌ పంపిన చెర్రీ

హైదరాబాద్‌: ఇటీవల కొవిడ్‌ బారిన పడిన అల్లుఅర్జున్‌ త్వరగా కోలుకోవాలని రామ్‌చరణ్‌ దంపతులు కోరుకున్నారు. కరోనా నుంచి కోలుకుని బన్నీ ఆరోగ్యంగా తిరిగి రావాలని ఆకాంక్షిస్తూ తాజాగా చరణ్‌ దంపతులు ఓ గ్రీటింగ్‌ కార్డు ఆయనకు పంపించారు. అంతేకాకుండా కొన్ని ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు, పండ్లు ఇతర సామగ్రిని సైతం ఆయనకు కానుకగా చెర్రీ పంపించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ చరణ్‌ దంపతులకు బన్నీ థ్యాంక్స్‌ చెప్పారు. మరోవైపు ‘ప్రియమైన బన్నీ!! కొవిడ్‌ నుంచి నువ్వు కోలుకుంటున్నావని ఆశిస్తున్నాం. నువ్వు ఆరోగ్యంగా తిరిగి వచ్చిన వెంటనే మనం కలుద్దాం’ అని చరణ్‌ పేర్కొన్నారు.

ఇక సినిమాల విషయానికి వస్తే బన్నీ ప్రస్తుతం ‘పుష్ప’లో నటిస్తున్నారు. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాలో బన్నీకి జోడీగా రష్మిక సందడి చేయనున్నారు. సినిమా షూట్‌లో బిజీగా ఉన్న బన్నీకి ఇటీవల పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన ఇంట్లోనే ఉంటూ వైద్యుల సూచనల మేరకు తగిన జాగ్రత్తలు పాటిస్తున్నారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని