మెగా అభిమానులకు శుభవార్త - ramcharan tested negative for corona
close
Updated : 12/01/2021 17:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మెగా అభిమానులకు శుభవార్త

హైదరాబాద్‌: మెగా అభిమానులకు శుభవార్త. టాలీవుడ్‌ యువ కథానాయకుడు రామ్‌చరణ్‌ కరోనా నుంచి కోలుకున్నారు. ఆయన గతేడాది డిసెంబర్‌ 29న కోవిడ్‌19 బారినపడ్డారు. కరోనా లక్షణాలు లేకపోవడంతో ఇంట్లోనే క్వారంటైన్‌లోకి వెళ్లారు. దాదాపు 15రోజుల తర్వాత తాజాగా కరోనా నుంచి  కోలుకున్నారు. ఈ విషయాన్ని ట్విటర్‌లో అభిమానులతో పంచుకున్నారాయన.

నాకు కరోనా నెగెటివ్‌ వచ్చింది. ఈ విషయాన్ని మీ అందరితో పంచుకోవడం సంతోషంగా ఉంది. మళ్లీ సినిమా పనుల్లో నిమగ్నమయ్యేందుకు సిద్ధంగా ఉన్నాను. అందరికీ ధన్యవాదాలు. - మీ రామ్‌చరణ్‌

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలో చరణ్‌ నటిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు తన తండ్రి మెగాస్టార్‌ చిరంజీవి ప్రధానపాత్రలో నటిస్తున్న ‘ఆచార్య’లోనూ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. అంతేకాదు.. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు చరణ్‌ నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉండగా.. సోదరి, నాగబాబు కూతురు నిహారిక వివాహం.. ఆ తర్వాత కరోనా సోకడం వంటి కారణాల వల్ల ఆయన కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇప్పుడు కరోనా నుంచి కోలుకోవడంతో మళ్లీ సినిమాల్లో నిమగ్నం కానున్నారు. 

ఇదీ చదవండి..

రూ.85లక్షల బడ్జెట్‌.. రూ.15కోట్ల కలెక్షన్స్‌

 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని