Centre: ఆ పది రాష్ట్రాల్లో పరీక్షలు, వ్యాక్సినేషన్‌ పెంచండి - ramp up testing along with vaccination centre tells 10 states with high covid caseload
close
Updated : 02/08/2021 05:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Centre: ఆ పది రాష్ట్రాల్లో పరీక్షలు, వ్యాక్సినేషన్‌ పెంచండి

దిల్లీ: థర్డ్‌ వేవ్‌ ముప్పు ముంచుకొస్తోందంటూ పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో మహమ్మారి వ్యాప్తిపై కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ ఆదివారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రోజురోజుకూ కొత్తగా కరోనా కేసులు, టెస్ట్‌ పాజిటివిటీ రేటు(టీపీఆర్‌) పెరుగుతున్న 10 రాష్ట్రాల్లో వైరస్‌ నిర్దారణ పరీక్షలు, వ్యాక్సినేషన్‌ను పెంచాల్సిందిగా రాజేశ్‌ భూషణ్‌ సూచించారు. కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, అస్సాం, మిజోరాం, మేఘాలయ, ఆంధ్రప్రదేశ్‌, మణిపుర్‌ రాష్ట్రాల్లో రోజువారీ కేసుల సంఖ్య ఇటీవల గణనీయంగా పెరుగుతున్నట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పాజిటివిటీ రేటు అధికంగా ఉన్న జిల్లాల్లో ప్రజలు గుమికూడకుండా నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచించారు. ఎక్కువగా కేసులు నమోదవుతున్న ప్రాంతాలను గుర్తించి కంటెయిన్‌మెంట్‌ జోన్లను ఏర్పాటు చేయాలన్నారు. కేసులు పెరగకుండా తగిన ముందస్తు జాగ్రత్తలను తీసుకోవాలన్నారు. 

కేరళలో కొనసాగుతున్న వైరస్‌ ఉద్ధృతి

దేశంలో.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 41,831 కేసులు, 541 మరణాలు సంభవించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో దేశవ్యాప్తంగా కొవిడ్‌ మరణాల సంఖ్య 4,24,351కి చేరుకుంది. ప్రస్తుతం 4,10,952 క్రియాశీల కేసులున్నాయి. అయితే కొత్తగా నమోదైన కేసుల్లో 50 శాతం కేరళలోనే వెలుగుచూడటం ఆందోళన కలిగిస్తోంది. ఆదివారం అక్కడ కొత్తగా 20,728 మందికి వైరస్‌ సోకగా.. కొవిడ్‌తో 56 మంది మరణించారు.     
 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని