‘సలార్‌’లో ప్రభాస్‌ సోదరిగా రమ్యకృష్ణ? - ramyakrishna as prabhas older sister
close
Published : 11/05/2021 01:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘సలార్‌’లో ప్రభాస్‌ సోదరిగా రమ్యకృష్ణ?

ఇంటర్నెట్‌ డెస్క్:  ప్రభాస్‌ కథానాయకుడుగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సలార్‌’. పాన్‌ ఇండియా చిత్రంగా వస్తున్న ఈ సినిమాలో శ్రుతిహాసన్‌ కథనాయిక. ఇప్పటికే సినిమాకి సంబంధించి ఓ షెడ్యూల్‌ గోదావరి ఖనిలో చిత్రీకరణ జరుపుకొన్న సంగతి తెలిసిందే. త్వరలోనే మరో కొత్త షెడ్యూల్‌ని ప్రారంభించనున్నారు. చిత్రంలో రమ్యకృష్ణ  ప్రభాస్‌ అక్కగా నటించనునే వార్తలు వినిపిస్తోన్నాయి. ఈ వార్త గురించి మరిన్ని విషయాలు తెలియాలంటే మరికొన్నాళ్లుగా ఆగాల్సిందే. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్‌ కిరగండూర్‌ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భువన్‌ గౌడ సినిమా ఛాయాగ్రాకుడిగా పనిచేస్తుండగా రవి బస్రూర్ సంగీత స్వరాలు అందిస్తున్నారు. ‘బాహుబలి’ సినిమా తర్వాత రమ్యకృష్ణ ‘సోగ్గాడే చిన్నినాయనా’, ‘శైలజారెడ్డి అల్లుడు’వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం తెలుగులో ఆమె ‘లైగర్‌’, ‘రిపబ్లిక్‌’ సినిమాల్లో నటిస్తోంది. 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని