Ranbir Kapoor: యాక్టర్‌గా ఫెయిలైతే అదే చేయమన్నారు - ranbir 39th birthday and unknown things
close
Updated : 29/09/2021 00:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Ranbir Kapoor: యాక్టర్‌గా ఫెయిలైతే అదే చేయమన్నారు

 39ఏటలోకి రణ్‌బీర్‌ కపూర్, జోద్‌పుర్‌లో ప్రేయసి ఆలియాతో సెలబ్రేషన్స్
 తన వ్యక్తిగత విషయాలు గురించి చెబుతూ ఏమన్నారంటే..

ఇంటర్నెట్‌ డెస్క్‌: రణ్‌బీర్‌ కపూర్‌.. కపూర్‌ వంశం నుంచి రావడం వల్లే ఇండస్ర్టీలో నిలదొక్కుకోలేదు. స్టార్‌గా ఎదగడానికి ఎన్నో కష్టాలు పడ్డాడు. ఎన్నో ఫెయిల్యూర్‌లు చూశాడు. అయినా సరే వెనకడుగు వేయకుండా నటనాపరంగా నిరూపించే పాత్రలు ఎంచుకున్నాడు. అలా వచ్చిన చిత్రాలే.. ‘వేక్‌ అప్‌ సిద్‌’, ‘రాక్ స్టార్‌’, ‘బర్ఫీ’, ‘రాజ్‌నీతి’, ‘అజబ్‌ ప్రేమ్‌కి గజబ్‌ కహానీ’. మంగళవారం రణ్‌బీర్‌ 39వ పడిలో చేరాడు. ఈ సందర్భంగా రణ్‌బీర్‌ తల్లి నీతూ సింగ్‌ నటి, ప్రేయసి ఆలియా భట్‌, సోదరి కరీనా కపూర్‌, నటుడు అర్జున్‌ కపూర్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. పుట్టిన రోజు సందర్భంగా రణ్‌బీర్‌ పంచుకున్న వ్యక్తిగత విషయాలేమిటంటే..

నాన్న నాతో బిజినెస్‌ పెట్టించాలనుకున్నారు..
‘‘అవును... మా ఇంట్లో అంతా సినిమా వాతావరణమే ఉంటుంది. అయినా సరే మానాన్న రిషీ కపూర్‌ నా చదువు తర్వాత నేను బిజినెస్‌ మొదలు పెట్టాలని కోరుకున్నారు. ఒక వేళ సినిమాల్లోకి వెళ్లి ఫెయిల్‌ అయినా ఇది మరో జీవనోపాధిగా ఉంటుందనేది ఆయన అభిప్రాయం. కానీ నేను మాత్రం సినిమా కోసమే బతుకుదామని నిశ్చయించుకున్నా. అది దర్శకుడిగా కానీ లేదా నిర్మాతగా అయినా సరే. కానీ ఇదిగో ఇలా నటుడిని అయ్యాను’’ అని రణ్‌బీర్‌ చెప్పాడు. 

అప్పట్లో యాక్టింగ్‌లో నేను వీక్‌..
‘‘స్కూల్‌ల్లో చదివేటప్పుడు నేను అసలు సరిగ్గా నటించలేకపోయేవాడిని.. ఇక డ్రామాల్లో ఆడిషన్‌ ఇచ్చేటప్పుడు నా యాక్టింగ్‌ నచ్చక నన్ను సెలక్ట్‌ చేసేవారు కాదు.. కానీ సెలబ్రెటీ కొడుకునని 5నిమిషాల నిడివి ఉండే పాత్రను ఇచ్చేవారు. దీంతో నేను దేనికి సరిపోనేమో అనేలా చేసింది. నేను యాక్టర్‌ కావాలనుకున్నా కానీ యాక్టింగ్‌ స్కిల్స్‌ లేవు. అయినా నిరూపించుకోవాలనే కసితో ముందుకు వచ్చా. ఇక నా వెనుక ఉన్న ‘కపూర్‌’ బ్యాక్‌గ్రౌండ్‌ను భుజాలమీద ఎత్తుకుని నటించడం.. నా మీద అంచనాలు పెట్టుకోవడం నాకు ఒత్తిడిగా అనిపించేది’’ అని రణ్‌బీర్‌ తెలిపాడు. 






మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని