‘యానిమల్‌’ సెట్స్‌పైకి వెళ్లేది అప్పుడే! - ranbir kapoor animal to go on floors in october
close
Published : 27/03/2021 15:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘యానిమల్‌’ సెట్స్‌పైకి వెళ్లేది అప్పుడే!

ఇంటర్నెట్‌ డెస్క్: ప్రముఖ తెలుగు దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్‌బీర్‌ కపూర్‌ కథానాయకుడిగా నటిస్తోన్న చిత్రం ‘యానిమల్‌’. పరిణీతి చోప్రా కథానాయిక. అనిల్‌కపూర్‌ ఓ కీలక పాత్రలో నటించనున్నారు. యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంగా తెరకెక్కనున్న ఈ చిత్రం అక్టోబర్‌లో సెట్స్ పైకి వెళ్లనుందని చిత్ర నిర్మాతల్లో ఒకరైన భూషణ్‌ కుమార్‌ వెల్లడించారు. ఇందులో బాబీ డియోల్‌ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. 

సిద్ధార్థ్ గరిమ డైలాగ్స్ అందిస్తుండగా హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ సంగీతం, సంతాన కృష్ణన్‌ రవిచంద్రన్‌ ఛాయాగ్రాహకుడిగా పనిచేయనున్నారు. ప్రస్తుతం రణ్‌బీర్‌ కపూర్‌.. భూషణ్‌ కుమార్‌ నిర్మాణంలోనే రూపొందుతున్న మరో చిత్రం ‘లవ్‌ రంజన్‌’లో నటిస్తున్నారు. శ్రద్ధా కపూర్‌ కథానాయికగా నటిస్తోంది. రణ్‌బీర్‌ - అలియాభట్‌ జంటగా నటించిన ‘బ్రహ్మాస్త్ర’ కరోనా కారణంగా చిత్రీకరణ వాయిదా పడింది. ఈ సినిమా హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ విడుదల కానుంది. 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని