‘రంగ్‌ దే’.. గుమ్మడికాయ కొట్టేశారు - rang de shoot wrapped
close
Published : 25/02/2021 02:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘రంగ్‌ దే’.. గుమ్మడికాయ కొట్టేశారు

ఇంటర్నెట్‌ డెస్క్‌: నితిన్‌, కీర్తి సురేశ్‌ జంటగా తెరకెక్కుతున్న ప్రేమ కథా చిత్రం ‘రంగ్‌ దే’. గివ్‌ మీ సమ్‌ లవ్‌ అనేది ఉపశీర్షిక. వెంకీ అట్లూరి దర్శకుడు. తాజాగా చిత్రీకరణ పూర్తయిందని సామాజిక మాధ్యమాల వేదికగా తెలియజేసింది చిత్రబృందం. ఈ మేరకు సెట్‌లో దిగిన ఓ ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. అందులో నితిన్‌, కీర్తి సురేశ్‌, దర్శకుడు వెంకీ, సీనియర్‌ నటుడు నరేశ్‌, హాస్య నటుడు వెన్నెల కిశోర్‌, ఛాయాగ్రాహకుడు పీసీ శ్రీరామ్‌ చిరు నవ్వులు చిందిస్తూ కనిపించారు. ‘రంగ్‌ దే చిత్రీకరణ పూర్తయింది. మీకు వినోదం పంచేందుకు ఈ హోలీ వస్తున్నాం’ అని అన్నారు దర్శకుడు వెంకీ. ‘ఎన్నో నవ్వులు అందించిన ఈ చిత్ర బృందాన్ని మిస్‌ అవుతున్నాను’ అన్నారు కీర్తి సురేశ్‌.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుని మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా. నితిన్‌ హీరోగా చంద్రశేఖర్‌ యేలేటి తెరకెక్కించిన ‘చెక్‌’ ఈ నెల 26న విడుదలవుతుంది. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ నాయికలు. 

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని