‘రంగస్థలం’.. మూడేళ్లకు తమిళంలో - rangasthalam tamil version
close
Published : 19/04/2021 01:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘రంగస్థలం’.. మూడేళ్లకు తమిళంలో

ఇంటర్నెట్‌ డెస్క్‌: రామ్‌ చరణ్‌, సమంత జంటగా నటించిన చిత్రం ‘రంగస్థలం’. సుకుమార్‌ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించింది. 2018 మార్చి 30న విడుదలై తెలుగు ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది ఈ చిత్రం. ఇప్పుడు తమిళ ప్రేక్షకుల్ని మెప్పించేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమా తమిళ డబ్బింగ్‌ వెర్షన్‌ని ఏప్రిల్‌ 30న విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది డిస్ట్రిబ్యూషన్‌, నిర్మాణ సంస్థ 7జీ ఫిల్మ్స్‌. తమిళనాడులో 300లకు పైగా స్ర్కీన్లలో ప్రదర్శించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్టు తెలియజేసింది. కోలీవుడ్‌లోనూ ‘రంగస్థలం’ పేరుతోనే విడుదలకానుంది.

యాక్షన్‌ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా చిట్టిబాబు పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. రామలక్ష్మిగా సమంత, రంగమ్మత్తగా అనసూయ, కుమార్‌ బాబుగా ఆదిపినిశెట్టి ఆకట్టుకున్నారు.

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని