‘చూసి నేర్చుకోవద్దంటున్నా..’ నితిన్‌! - rangde song promo
close
Published : 13/03/2021 20:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘చూసి నేర్చుకోవద్దంటున్నా..’ నితిన్‌!

హైదరాబాద్‌: నితిన్‌, కీర్తి సురేష్‌ జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘రంగ్‌దే’. వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో హీరో నితిన్‌ పెళ్లి తర్వాత మగవాళ్ల పరిస్థితి ఎలా ఉంటుందో సరదాగా చూపించబోతున్నారు. అలాగే భావోద్వేగాలను కూడా అంతేస్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఈ చిత్రంలోని రెండు పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా సినిమాలో ఇంట్రో సాంగ్‌లా అనిపిస్తున్న ‘చూసి నేర్చుకోకు..’అంటూ సాగుతున్న పాట ప్రోమోను విడుదల చేశారు. మంచి డ్యాన్స్‌ మూవ్స్‌తో నితిన్‌ ఇరగదీస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌  పీసీ శ్రీరామ్‌ ఈ చిత్రానికి పని చేస్తుండటం విశేషం. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న  ఈ చిత్రం మార్చి 26  ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి లేటెందుకు ఆ ప్రోమోను మీరు చూసేయండి!
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని