pooja hegde: అతడు పూర్తిగా భిన్నమైన వ్యక్తి - ranveer is the exact opposite says pooja hegde
close
Published : 28/05/2021 01:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

pooja hegde: అతడు పూర్తిగా భిన్నమైన వ్యక్తి

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రస్తుతం టీటౌన్‌తో పాటు బీటౌన్‌లోనూ వరుసగా ఆఫర్లతో టాప్‌గేర్‌లో దూసుకెళుతోంది ముద్దుగుమ్మ పూజా హెగ్డే. గతేడాది ఆమె నటించిన ‘అలవైకుంఠ పురములో’ చిత్రం భారీ విజయం సాధించింది. దీంతో ఆమె క్రేజ్‌ అమాంతం పెరిగింది. ఇప్పుడు ఆమె చేతిలో అరడజనుకు పైగా చిత్రాలు ఉన్నాయి. తెలుగు, తమిళంతో పాటు హిందీలోనూ ఆమె పలు చిత్రాలకు ఇప్పటికే సంతకాలు చేసేసింది. బాలీవుడ్‌ స్టార్‌ రణ్‌వీర్‌సింగ్‌తో కలిసి ‘సర్కస్‌’ చిత్రంలో నటిస్తోంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఇటీవల ఒక ప్రముఖ ఛానల్‌ ఇంటర్వ్యూలో పాల్గొంది.ఈ సందర్భంగా పూజ పలు అసక్తికరమైన విషయాలు పంచుకుంది.

రణ్‌వీర్‌సింగ్‌ నుంచి ఏదైనా దొంగిలించాలంటే ఏం తీసుకుంటారు అని ఎదురైన ప్రశ్నకు ఆమె స్పందించింది. ‘‘ఒకవేళ రణ్‌వీర్‌ నుంచి ఏదైనా తీసుకునే అవకాశం వస్తే.. అతని ఎనర్జీ, పరిశీలన శక్తిని తీసుకుంటాను. అతను చాలా తెలివైన వాడు. దేన్నీ అంత సులువుగా వదిలిపెట్టడు. నాకు ఆ విషయం బాగా నచ్చుతుంది. నిజానికి నేను ఇంట్రోవర్ట్‌ని. కానీ, రణ్‌వీర్‌ నాకు పూర్తి భిన్నమైన వ్యక్తి. కొన్నిసార్లు రణ్‌వీర్‌లా ఉండాలనిపిస్తుంది’’ అని పూజా చెప్పుకొచ్చింది.

పూజా హెగ్డే ప్రస్తుతం తెలుగులో మూడు చిత్రాల్లో నటిస్తోంది. ‘రాధేశ్యామ్‌’లో ప్రభాస్‌ సరసన సందడి చేయనుంది. అంతేకాదు. మెగాస్టార్‌ చిరంజీవి చిత్రం ‘ఆచార్య’తో పాటు ఆమె ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’లో అక్కినేని అఖిల్‌తో ఈ భామ ఆడిపాడనుంది. తమిళ స్టార్‌ హీరో విజయ్‌ 65వ సినిమాలోనూ నటిస్తోంది. అది చిత్రీకరణ దశలో ఉంది. హిందీలో ‘సర్కస్‌’, ‘కభీ ఈద్‌ కభీ దివాళి’ చిత్రాలు ఆమె చేతిలో ఉన్నాయి. కాగా.. సర్కస్‌ చిత్రానికి రోహిత్‌శెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. రణ్‌వీర్‌సింగ్‌, జాక్వలైన్‌ ఫెర్నాండెజ్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అందులో పూజా హెగ్డే ఓ కీలక పాత్రలో కనిపించనుంది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని