#RAPO19 రచ్చ చేసేందుకు సిద్ధమవుతున్న రామ్‌ - rapo19 shoot commences on july 12th
close
Published : 07/07/2021 16:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

#RAPO19 రచ్చ చేసేందుకు సిద్ధమవుతున్న రామ్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: వరుస హిట్లతో మంచి జోష్‌ మీద కనిపిస్తున్నాడు టాలీవుడ్‌ యువ కథనాయకుడు రామ్‌ పోతినేని. మరోసారి రచ్చ చేసేందుకు సిద్ధమయ్యాడు. తన తర్వాతి సినిమాను కోలీవుడ్‌ డైరెక్టర్‌ లింగుస్వామితో ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా సినిమాకు సంబంధించిన మరో లేటెస్ట్‌ అప్డేట్‌ ఇచ్చాడు. జూలై 12 నుంచి ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుందట. చాలాకాలం కిత్రమే పూజా కార్యక్రమాలు చేసుకున్న ఈ సినిమా చిత్రీకరణ గతంలోనే ప్రారంభం కావాల్సి ఉంది. కాగా.. కరోనా కారణంగా వాయిదా వేయాల్సి వచ్చింది. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో పాటు లాక్‌డౌన్‌ను ఎత్తివేశారు. మరోవైపు ప్రభుత్వం నుంచి అన్ని రకాల అనుమతులు రావడంతో సినిమాను పట్టాలెక్కించేందుకు దర్శకనిర్మాతలు సిద్ధమయ్యారు. ఈ సినిమాలో రామ్ సరసన ‘ఉప్పెన’ చిన్నది కృతిశెట్టి హీరోయిన్‌గా సందడి చేయనుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై పవన్‌ కుమార్‌ సమర్పణలో శ్రీనివాస్‌ చిట్టూరి నిర్మిస్తున్నారు. #RAPO19 అనే వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కనున్న సినిమా టైటిల్‌ను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని