అప్పుడు ప్రభాస్‌, రానా మాత్రమే తెలుసు! - rashi sing interview
close
Published : 17/03/2021 11:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అప్పుడు ప్రభాస్‌, రానా మాత్రమే తెలుసు!

యువ కథానాయిక రాశీ సింగ్‌

‘ఒకే రకమైన పాత్రలకు పరిమితమవడం ఇష్టం లేదు’ అంటోంది యువ కథానాయిక రాశీ సింగ్‌. ‘శశి’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించనుంది ఈ భామ. ఆది హీరోగా శ్రీనివాస్‌ నాయుడు నందికట్ల తెరకెక్కించిన సినిమా ఇది. సురభి మరో నాయిక. ఈ సినిమా మార్చి 19 విడుదలవుతున్న సందర్భంగా విలేకర్లతో ముచ్చటించింది రాశీ సింగ్‌. ఆమె పంచుకున్న ఆసక్తికర విశేషాలివీ...

బాల్యం నుంచే ఆసక్తి.. 

నా స్వస్థలం రాయ్‌పూర్‌. చిన్నప్పటి నుంచే నాకు నటన అంటే ఆసక్తి. ఎక్కడా శిక్షణ తీసుకోకపోయినా ధారావాహికల్లోని (సీరియల్స్‌) పాత్రలు చూసి వాటిని రోజూ అద్దం ముందు ప్రాక్టీస్‌ చేసేదాన్ని. ఇదంతా చూసి అమ్మ నన్ను నటిని చేయాలనుకుంది. నేను ఇక్కడి వరకు రావడానికి ఆమె ప్రోత్సాహం ఎంతో ఉంది. అయితే నాకేమో ఎవరి మీదా ఆధారపడకుండా కొన్నాళ్లు ఉద్యోగం చేసి ఆ తర్వాత సినిమాల్లోకి రావాలని ఉండేది. అందుకే మోడలింగ్‌, ఎయిర్‌ హోస్టెస్‌గా పనిచేశాను. సంవత్సరం పాటు ఇండిగో ఎయిర్‌ లైన్స్‌లో విధులు నిర్వర్తించాను. ఆ సమయంలోనే హైదరాబాద్‌ షిఫ్ట్‌ అయ్యాను. ఇక్కడికి వచ్చాక సినీ ప్రయత్నాలు మొదలుపెట్టాను. అలా పూరీ కనెక్ట్స్‌ ఏజెన్సీ ద్వారా అవకాశం వచ్చింది. 

అందరికీ నచ్చుతుంది..

‘శశి’ చిత్రం కంటే ముందు నేను మరో సినిమాలో నటించాను. కరోనా కారణంగా అది ఆలస్యమైంది. దాంతో నా తొలి చిత్రంగా ‘శశి’నే విడుదలవుతుంది. అందరికీ కనెక్ట్‌ అయ్యే కథ శశి. ఇందులో నా పాత్ర పేరు సునీత. గాయనిగా కనిపిస్తాను. నిస్వార్థమైన అమ్మాయి. హోమ్లీగా ఉంటుంది. ఈ చిత్రంలోని మరో నాయిక సురభి చాలా బాగా నటించింది. నా కంటే సీనియర్‌ అనే భావన ఎప్పుడూ కలగలేదు. మా ఇద్దరి కాంబినేషన్‌లో సన్నివేశాలు లేకపోవడంతో ఆమెతో కలిసి నటించే అవకాశం రాలేదు. ఆది జెంటిల్‌మెన్‌. ఆన్‌ సెట్‌, ఆఫ్‌ సెట్‌ ఒకేలా ఉంటాడు. చాలా కంఫర్టబుల్‌. ఈ చిత్ర టీజర్‌, ట్రైలర్‌, పాటలకు మంచి స్పందన వచ్చింది. సినిమా విజయం అందుకుంటుందని నమ్మకం ఉంది.

అన్ని రకాలుగా నటించాలి..

హైదరాబాద్‌ రాక ముందు టాలీవుడ్‌ హీరోల్లో ప్రభాస్‌, రానా తెలుసు. సినిమా ప్రచారంలో భాగంగా రానాని కలవడం చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడిప్పుడే ఇతర నటీనటులు, దర్శకుల వివరాలు తెలుసుకుంటున్నాను. నటనలో నాకు ప్రియాంక చోప్రా స్ఫూర్తి. దక్షిణాది చిత్రాలంటే చాలా ఇష్టం. అల్లు అర్జున్‌, రాజమౌళితో పనిచేయాలని ఉంది. ఒకే రకమైన పాత్రలకు పరిమితం కాకుండా లవ్‌, థ్రిల్లర్‌, డ్రామా ఇలా అన్ని జోనర్లలో నటించాలనేదే లక్ష్యం. ప్రస్తుతం నాలుగు సినిమాలు చేస్తున్నా. అందులో ఒకటి మర్డర్‌ మిస్టరీ క్రైమ్‌ నేపథ్యంలో తెరకెక్కుతోంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని