Sports News: ఆ విషయాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటా:రషీద్‌ఖాన్‌ - rashid khan feels wickets of dhoni kohli and abd a big achievement for him
close
Published : 07/06/2021 01:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Sports News: ఆ విషయాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటా:రషీద్‌ఖాన్‌

(photo:Rashid Khan Twitter)
 

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ, ప్రస్తుత టీమ్‌ఇండియా సారథి, పరుగుల యంత్రం విరాట్‌ కోహ్లీ, బ్యాటింగ్‌ మ్యాస్ట్రో ఏబీ డివిలియర్స్‌లను ఔట్‌ చేసిన విషయాన్ని తన మదిలో ఎప్పటికీ గుర్తుంచుకుంటానని అఫ్ఘనిస్థాన్‌ స్పిన్నర్‌ రషీద్‌ఖాన్‌ అన్నాడు. ఐపీఎల్‌లో రషీద్‌ ఈ ముగ్గురిని చాలాసార్లు ఔట్‌ చేశాడు. తాజాగా ఈ విషయాన్ని రషీద్‌ గుర్తుచేసుకున్నాడు.

‘నిజం చెప్పాలంటే నాకెన్నో మరపురాని వికెట్లున్నాయి. కానీ, టీ20ల్లో నా ఉత్తమమైన మూడు వికెట్లు మహేంద్రసింగ్‌ ధోనీ, విరాట్‌ కోహ్లీ, ఏబీ డివిలియర్స్‌ మాత్రమే. ఈ ముగ్గురికి నేను బౌలింగ్‌ చేశా. చాలా సార్లు వీరిని ఔట్‌ చేశా. కొన్నిసార్లు క్యాచ్‌లు, మరికొన్ని సార్లు ఎల్బీడబ్ల్యూల రూపంలో పెవిలియన్‌కు పంపించాను. ఇలాంటి దిగ్గజాలకు బౌలింగ్‌ చేయడం నాకు దక్కిన పెద్ద ఘనత. వీరికి బౌలింగ్‌ చేయడం చాలా కష్టమైన పని. ఈ ముగ్గురిని ఔట్‌ చేసిన విషయాన్ని నా మదిలో ఎప్పటికీ గుర్తుంచుకుంటాను’ అని రషీద్‌ఖాన్ అన్నాడు.

ఐపీఎల్‌లో రషీద్‌ఖాన్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు 69 ఐపీఎల్ మ్యాచ్‌లాడిన రషీద్‌ 85 వికెట్లు పడగొట్టాడు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని