నాగార్జున చిత్రంలో యాంకర్‌ రష్మి? - rashmi gautam in nagarjuna movie
close
Published : 27/05/2021 13:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నాగార్జున చిత్రంలో యాంకర్‌ రష్మి?

ఇంటర్నెట్‌ డెస్క్: తెలుగునాట రష్మి గౌతమ్‌ బుల్లితెరపై యాంకర్‌గా వ్యవహరిస్తూ సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఆమె ఈటీవీలో ప్రసారమవుతున్న ఖతర్నాక్‌ కామెడీ షో ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్‌’ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ అలరిస్తుంటుంది. తాజాగా ఆమె నాగార్జున హీరోగా ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో నటించే అవకాశం దక్కించుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలే ఈ చిత్రం గోవాలో తన మొదటి షెడ్యూల్ షూటింగ్‌ జరుపుకుంది. త్వరలోనే రెండో షెడ్యూల్‌ కూడా మొదలు కానుంది. ఇందులో కథానాయికగా కాజల్‌ అగర్వాల్  నటిస్తోంది. సినిమాను శ్రీవేంకటేశ్వర ఎల్‌ఎల్‌పీ, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రష్మి గతంలో ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వచ్చిన 'గుంటూరు టాకీస్'లో తన నటనతో మెప్పించింది. ప్రస్తుతం ఆ పరిచయంతోనే ఆమెకు అవకాశం లభించిందనే వార్తలు సైతం వినిపిస్తున్నాయి. రష్మి హిందీ, తమిళ, కన్నడంలోనూ నటించింది. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని