close

తాజా వార్తలు

బాలయ్య సరసన రష్మి

హైదరాబాద్‌: మాస్‌లో నందమూరి బాలకృష్ణకు ఇమేజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లిన చిత్రాలు ‘సింహా’, ‘లెజెండ్‌’. బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాలు నటుడిగా బాలకృష్ణ మరో కోణాన్ని చూపించారు. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో ముచ్చటగా మూడోసాని తెరకెక్కుతోంది. ఇటీవల ప్రారంభమైన ఈ చిత్రం త్వరలోనే రెగ్యులర్‌ షూటింగ్‌ జరుపుకోనుంది. ప్రారంభోత్సవం సందర్భంగా ‘నువ్వొక మాటంటే అది శబ్దం...అదే మాట నేనంటే శాసనం’’ అంటూ బాలకృష్ణ చెప్పిన డైలాగ్‌ అభిమానులను విశేషంగా అలరిస్తోంది. మరోసారి మాస్‌-మసాలా సినిమాతో బాలకృష్ణను సరికొత్తగా ప్రజెంట్‌ చేయనున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో ఒక ప్రత్యేక పాత్ర ద్వారా సినిమాకు మరింత అందం, క్రేజ్‌ తీసుకొచ్చే యోచనలో ఉందట చిత్ర బృందం. ఆ పాత్ర కోసం నటి, యాంకర్‌ రష్మిని సంప్రదించారట బోయపాటి. యాంకర్‌గా బుల్లితెరపై అలరిస్తున్న రష్మి.. అడపాదడపా కొన్ని చిత్రాల్లో గ్లామరస్‌ పాత్రల్లోనూ మెప్పించారు. ఇప్పుడు ఈ సినిమాలో కథను కీలక మలుపుతిప్పే పాత్రతో పాటు, గ్లామర్‌గా కనిపించాల్సి ఉండటంతో రష్మిని స్పందించారని సమాచారం. దీనిపై అధికారికంగా చిత్ర బృందం స్పందించాల్సి ఉంది.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.