రష్మిక.. క్రికెటర్‌ లిల్లీగా ఇలా మారింది! - rashmik mandanna share video one year of dear comrade
close
Published : 27/07/2020 01:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రష్మిక.. క్రికెటర్‌ లిల్లీగా ఇలా మారింది!

హైదరాబాద్‌: విజయ్‌ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన చిత్రం ‘డియర్‌ కామ్రేడ్‌’. భరత్‌ కమ్మ దర్శకుడు. గతేడాది విడుదలైన ఈ చిత్రం ఫీల్‌గుడ్‌ మూవీగా బాక్సాఫీస్‌ వద్ద పర్వాలేదనిపించింది. యూత్‌ ఐకాన్‌గా విజయ్‌, క్రికెటర్‌గా రష్మిక పాత్రలు అలరించాయి. ఇద్దరి మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు యువ హృదయాలను తాకాయి. ఆదివారంతో ఈ చిత్రం విడుదలైన ఏడాది పూర్తి చేసుకుంది ఈ సందర్భంగా కథానాయిక రష్మిక అరుదైన వీడియోను షేర్‌ చేసింది.

‘‘ఒక మహిళగా.. ఒక పోరాట యోధురాలిగా ఇది నిజం. నీ ప్రేమ కోసం పోరాడు. ‘డియర్‌ కామ్రేడ్‌’ చేస్తున్న సమయానికి నాకు కనీసం బ్యాట్‌ పట్టుకోవడం కూడా రాదు. నిజం ఇది నమ్మండి. నీవు నిన్ను నమ్మితే ఏదైనా సాధ్యమే. సమయం పడుతుంది. కానీ, తప్పకుండా సాధ్యమవుతుంది. సాధనతోనే దాన్ని సాధించవచ్చు. సహనం, ఓపిక, కొద్దిగా నీపై నీకు నమ్మకం. శక్తి, ప్రేమను ప్యాక్‌ చేసి మీకు పంపుతున్నా’’ అని ఇన్‌స్టాలో పేర్కొంది.

ఈ సినిమాను నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్‌ కూడా రెండు ఆసక్తికర వీడియోలను పంచుకుంది. ‘వన్‌ ఇయర్‌ ఆఫ్‌ డియర్‌ కామ్రేడ్‌ మెమొరీస్‌’, పేరుతో షూటింగ్‌ సందర్భంగా జరిగిన జ్ఞాపకాల వీడియోతో పాటు, ‘ఓ కలలా కథలా’ పాట రీప్రైజ్‌ వెర్షన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ రెండు వీడియోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని