శంకర్‌ - రామ్‌చరణ్‌ చిత్రంలో కథానాయికగా రష్మిక? - rashmika as the heroine in shankar-ramcharan movie
close
Published : 18/02/2021 01:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

శంకర్‌ - రామ్‌చరణ్‌ చిత్రంలో కథానాయికగా రష్మిక?

ఇంటర్నెట్‌ డెస్క్:‘జెంటిల్‌మెన్‌’ ‘భారతీయుడు’ ‘అపరిచితుడు’లాంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు శంకర్‌. ప్రస్తుతం రామ్‌చరణ్‌ కథానాయకుడిగా ఓ సినిమా చేస్తున్నారు. ఈ  చిత్రం శంకర్‌కు 15వ సినిమా,  అలాగే రామ్‌చరణ్‌కు కూడా ఇది 15వ చిత్రమవడం విశేషం. పొలిటికల్‌ థ్రిల్లర్‌ నేపథ్యంగా తెరకెక్కనున్న చిత్రంలో కథానాయికగా రష్మిక మందన నటించనుందని వార్తలొస్తున్నాయి. చరణ్‌ - రష్మిక పేరును శంకర్‌, దిల్‌రాజులకు సూచించాడని చెప్పుకుంటున్నారు. దిల్‌రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాను శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇది ఆ  సంస్థకు 50వ చిత్రం. ఇంకా పేరు పెట్టని ఈ సినిమాని 3డీ ఫార్మాట్‌లో చిత్రీకరించాలని దర్శకుడు శంకర్‌ యోచిస్తున్నాడట. మరో వైపు అనిరుధ్‌ని సంగీత దర్శకుడిగా తీసుకోవాలనే ఆలోచనలో శంకర్‌ ఉన్నాడనే వార్తలొస్తున్నాయి.  రష్మిక దక్షిణాది చిత్రాలతో పాటు బాలీవుడ్‌లో సిద్ధార్థ మల్హోత్రా కథానాయకుడిగా నటిస్తోన్న ’మిషన్‌ మజ్ను’ అనే చిత్రంలో నటిస్తోంది. రష్మిక చాలా బిజీగా ఉన్నప్పటికీ శంకర్‌ దర్శకత్వంలో నటించేందుకు ఒప్పుకోనుందని సినీవర్గాల సమాచారం. 

ఇదీ చదవండి:

నటుడిగా కాదు.. బాధితుడిగా ఇక్కడికొచ్చా: తారక్‌
 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని