Rashmika: ఇటు టాలీవుడ్‌.. అటు బాలీవుడ్‌.. రష్మిక A to Z - rashmika mandanna full busy with tollywood movies
close
Published : 27/07/2021 11:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Rashmika: ఇటు టాలీవుడ్‌.. అటు బాలీవుడ్‌.. రష్మిక A to Z

హైదరాబాద్‌: ఇటు దక్షిణాదిలో.. అటు ఉత్తరాదిలో వరుస సినిమాలతో జోరు చూపిస్తోంది రష్మిక. ఓ పూట ముంబయిలో కనిపిస్తుంటే.. మరోపూట హైదరాబాద్‌లో దర్శనమిస్తోంది. చకచకా ఫ్లైట్లు ఎక్కిదిగుతూ.. క్షణం తీరిక లేకుండా చిత్రీకరణలతో గడిపేస్తోంది. బాలీవుడ్‌ సినిమా ‘మిషన్‌ మజ్ను’ చిత్రీకరణ కోసం ఆదివారమే ముంబయి వెళ్లిన ఈ అమ్మడు.. ఒక్కరోజులో తన పని పూర్తి చేసుకుని భాగ్యనగరంలో వచ్చి వాలిపోయింది.

ఆ వెంటనే సోమవారం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ చిత్ర సెట్లోకి అడుగుపెట్టేసింది. శర్వానంద్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది. కిషోర్‌ తిరుమల తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే చిత్రీకరణ ప్రారంభమైంది. ప్రస్తుతం శర్వా, రష్మికలపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్‌ పూర్తి కాగానే అమితాబ్‌బచ్చన్‌తో కలిసి నటిస్తున్న ‘గుడ్‌ బై’ సినిమా కోసం మళ్లీ ముంబయి విమానం ఎక్కనుంది రష్మిక. ప్రస్తుతం ఆమె తెలుగులో అల్లు అర్జున్‌ ‘పుష్ప’ చిత్రంలోనూ నటిస్తోంది. సుకుమార్‌ తెరకెక్కిస్తున్న ఈ  సినిమా ప్రస్తుతం తుది దశ చిత్రీకరణలో ఉంది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని