మరో బాలీవుడ్‌ చిత్రానికి రష్మిక గ్రీన్‌ సిగ్నల్‌ - rashmika mandanna hints at third bollywood film
close
Published : 27/04/2021 20:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మరో బాలీవుడ్‌ చిత్రానికి రష్మిక గ్రీన్‌ సిగ్నల్‌

ఇంటర్నెట్‌ డెస్క్: ప్రస్తుతం తెలుగులో వరుసగా సినిమాలతో బిజీగా ఉన్న భామ రష్మిక మందన. తన చిరునవ్వుతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఆమె ‘సరిలేరు నీకెవ్వరు’లో మరింత క్యూట్‌గా కనిపించి అలరించింది. ప్రస్తుతం ఈ అమ్మడు హిందీలో రెండు చిత్రాల్లో నటిస్తోంది. అయితే తాజాగా మరో బాలీవుడ్‌ చిత్రానికి కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు సోషల్‌ మీడియాలో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చింది. అయితే, కథేంటి? దర్శకుడు ఎవరు? హీరో ఎవరు? అన్న వివరాలు మాత్రం చెప్పలేదు.

రష్మిక - సిద్ధార్థ మల్హోత్రాతో కలిసి స్పై థ్రిల్లర్‌ నేపథ్యంలో వస్తోన్న ‘మిషన్‌ మజ్ను’ అనే చిత్రంతోనే బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత అమితాబ్‌ బచ్చన్‌తో కలిసి నటిస్తున్న ‘గుడ్‌బై’ హిందీలో రెండో చిత్రం. హీరో కార్తీతో కలిసి ‘సుల్తాన్‌’ సినిమాతో తమిళ తంబీలను ఆకట్టుకుంది. ఇటీవలే సినిమా తెరపైకి వచ్చింది. ప్రస్తుతం రష్మిక తెలుగులో అల్లు అర్జున్‌తో కలిసి ‘పుష్ప’లో నటిస్తోంది. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని