ఖరీదైన ఫ్లాట్‌ కొనుగోలు చేసిన రష్మిక..? - rashmika mandanna purchases a posh flat in mumbai
close
Published : 26/02/2021 10:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఖరీదైన ఫ్లాట్‌ కొనుగోలు చేసిన రష్మిక..?

హైదరాబాద్‌: వరుస సినిమాలతో కెరీర్‌లో దూసుకెళ్తున్నారు నటి రష్మిక. కన్నడలో మంచి విజయాన్ని సాధించిన ‘కిర్రాక్‌పార్టీ’తో వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన ఈ భామ దక్షిణాదిలో వరుస సినిమాలు చేస్తూ బిజీ షెడ్యూల్‌ గడుపుతున్నారు. తెలుగులో స్టార్‌ హీరోల చిత్రాల్లో ఆఫర్స్‌ సంపాదించుకుంటోన్న రష్మిక ఇటీవల బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. సిద్దార్థ్‌ మల్హోత్ర సరసన ‘మిషన్‌ మజ్ను’లో నటిస్తున్నారు. ఇటీవల ప్రారంభమైన ఈ సినిమా షూట్‌లో గత కొన్నిరోజుల నుంచి ఆమె పాల్గొంటున్నారు. ‘మిషన్‌ మజ్ను’ విడుదల కాకముందే బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌బచ్చన్‌ చిత్రంలో నటించే బంపర్‌ ఆఫర్‌ను రష్మిక సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

కాగా, తాజా సమాచారం ప్రకారం ఇటీవల రష్మిక ముంబయిలో ఓ ఖరీదైన ఫ్లాట్‌ను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. వరుస షూటింగ్స్‌లో భాగంగా ఇటు దక్షిణాదితోపాటు ఉత్తరాదిలోనూ ఉండాల్సి వస్తుందట. దీంతో, ఇంటి విషయంలో ప్రతిసారీ ఇబ్బందిపడకుండా ఉండేలా తాజాగా ముంబయిలోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో రష్మిక.. ఓ విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేశారంటూ వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా తనకెంతో ఇష్టమైన కొన్ని వస్తువులను సైతం హైదరాబాద్‌లోని ఇంటి నుంచి ముంబయికు తీసుకువెళ్లారట ఈ ముద్దుగుమ్మ. అయితే ఈ వార్తలపై ఆమె నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని