రష్మిక.. సో క్యూట్‌... సో స్వీట్‌ - rashmika mandanna shares funny moods pic in instagram
close
Published : 19/04/2021 12:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రష్మిక.. సో క్యూట్‌... సో స్వీట్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘హీ ఈజ్‌ సో క్యూట్‌...హీ ఈజ్‌ సో స్వీట్‌ అంటూ  రష్మిక ‘సరిలేరు నీకెవ్వరు’లో మహేష్‌ బాబుతో చేసిన అల్లరి ఇంతా అంతా కాదు. తెర పైనే కాదు తెర వెనుక కూడా చాలా సరదాగా నవ్వుతుంటుంది రష్మిక. సామాజిక మాధ్యమాల్లో అభిమానులతో నిత్యం టచ్‌లో ఉంటూ వాళ్లలో కొత్త జోష్‌ నింపేలా పోస్ట్‌లు పెడుతుంటుంది.

తాజాగా రకరకాల భావోద్వేగాలు పలికిస్తున్న తన ఫొటోలను పంచుకుంది. నవ్వు, చిరు కోపం, సిగ్గు, ప్రశాంతం, ఆశ్చర్చం, చిలిపితనం...ఇలాంటి భావోద్వేగాలు నిండిన పొటోలవి. వీటిల్లో మీరు ఏ మూడ్‌ని ఎంచుకుంటారు? అని ఇన్‌స్టాలో రాసింది. దీనికి నెటిజన్లు బాగా స్పందించారు. రష్మిక సో స్వీట్‌ అని ఒకరు...సో క్యూట్‌ అని ఇంకొకరు...సో హాట్‌ అని కొందరు....వావ్‌ అదిరిపోయావు అంటూ కొందరు నెటిజన్లు స్పందించారు. ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి.

ప్రస్తుతం రష్మిక అల్లు అర్జున్‌తో కలిసి ‘పుష్ప’, హీరో శర్వానంద్‌తో కలిసి ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’లో నాయికగా నటిస్తోంది. ఇక హిందీలో సిద్ధార్థ మల్హోత్రా కథానాయకుడిగా నటిస్తోన్న ‘మిషన్‌ మజ్ను’తో పాటు అమితాబ్ బచ్చన్‌తో కలిసి ‘గుడ్‌బై’ చిత్రంలో నటిస్తోంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని