ప్రియమైన వారి నుంచి ఉంగరం అందింది - rashmika mandanna shares ringphoto
close
Updated : 30/03/2021 12:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రియమైన వారి నుంచి ఉంగరం అందింది

హైదరాబాద్‌: నటి రష్మిక తన చేతి ఉంగరాన్ని చూసుకోని మురిసిపోతుంది. తనకు అత్యంత ప్రియమైన వ్యక్తుల నుంచి ఆ ఉంగరం అందిందట. తనకందిన ఆ అపురూప కానుకని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో పంచుకుంది ఆమె.

‘‘ఇది నాకు ఎవరు పంపారో తెలుసు. దీన్ని నేను అందుకున్నా. నేను మీ రహస్య సందేశాన్ని చదివాను. నాకిది సరిగ్గా సరిపోయింది. నేను దీన్ని ప్రేమిస్తున్నాను’’ అంటూ రష్మిక ఆ ఫొటోకి ఓ వ్యాఖ్యని కూడా జత చేసింది. దీంతో ఇప్పుడీ ఉంగరం కథ కాస్తా నెట్టింట వైరల్‌గా మారిపోయింది.

రష్మిక పస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. తమిళంలో ఆమె ఎంట్రీ ఇస్తున్న ‘సుల్తాన్‌’ ఏప్రిల్‌ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో కార్తి కథానాయకుడిగా నటిస్తున్నాడు. దీంతో పాటు, అల్లు అర్జున్‌తో ‘పుష్ప’, ‘మిషన్‌మజ్ను’, ‘ఆడాళ్లు మీకు జోహార్లు’ చిత్రాల్లో నటిస్తోంది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని