‘పుష్ప’ షూట్‌.. నాలుగు గంటలే నిద్ర: రష్మిక - rashmika on working with allu arjun
close
Updated : 10/02/2021 10:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘పుష్ప’ షూట్‌.. నాలుగు గంటలే నిద్ర: రష్మిక

విభిన్నమైన చిత్రం అంటోన్న నటి

హైదరాబాద్‌: అల్లు అర్జున్‌ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. సుకుమార్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రంలో బన్నీకి జంటగా రష్మిక సందడి చేయనున్నారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ‘పుష్ప’ చిత్రీకరణ‌ గురించి నటి రష్మిక స్పందించారు. ‘‘అల్లు అర్జున్‌తో కలిసి పనిచేయడం స్పెషల్‌గా ఉంది. ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. మంచి వ్యక్తి, మనసుపరంగా చిన్నపిల్లవాడు. ఆన్‌స్ర్కీన్‌లో మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఆయనతో కలిసి నటించడం సులభమే’’

‘‘ఇప్పటివరకూ నేను చేసిన చిత్రాల్లో ‘పుష్ప’ ఎంతో విభిన్నమైన చిత్రం. సుదూర ప్రాంతాల్లో చిత్రీకరణ కారణంగా ఎన్నో సవాళ్లు‌ ఎదుర్కొంటున్నాను. తెల్లవారుజామున 4 గంటలకు నిద్రలేచి లొకేషన్‌కు చేరుకుంటున్నాం. మళ్లీ ఇంటికి వచ్చేసరికి రాత్రి 10 అవుతోంది. భోజనం, వర్కౌట్లు చేసి నిద్రపోయేసరికి 12 నుంచి ఒంటిగంట అవుతోంది. దానివల్ల కేవలం నాలుగు గంటలు మాత్రమే నిద్రపోతున్నాను. కష్టానికి తగిన ప్రతిఫలాన్ని మీరు స్ర్కీన్‌పై చూస్తారు’’ అని రష్మిక తెలిపారు. అంతేకాకుండా ఈ సినిమాలో హీరో హీరోయిన్స్‌ మేకప్‌ చాలా కీలకమైందని.. దీని కోసమే రెండు గంటలు కేటాయించాల్సి వస్తోందని ఆమె వివరించారు.

ఇదీ చదవండి

బొమ్మలు కొనిచ్చి నాతో సినిమా చేయించారుమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని