కొవిడ్‌-19 వాక్సిన్‌ తీసుకున్న రవిశాస్త్రి - ravi shastri got coronavirsu vaccination shares pic on social media
close
Updated : 02/03/2021 13:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొవిడ్‌-19 వాక్సిన్‌ తీసుకున్న రవిశాస్త్రి

(Photo: Ravi Shastri Twitter)

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా హెడ్‌కోచ్‌ రవిశాస్త్రి మంగళవారం కరోనా టీకా తీసుకొన్నాడు. దానికి సంబంధించిన ఫొటోను ట్విటర్‌లో పంచుకొని సంతోషం వ్యక్తం చేశాడు. ‘ఇప్పుడే కొవిడ్‌-19 వాక్సిన్‌ చేయించుకున్నా. ఈ మహమ్మారికి వ్యతిరేకంగా భారత్‌ను శక్తిమంతమైన దేశంగా తీర్చిదిద్దిన శాస్త్రవేత్తలు, మెడికల్‌ సిబ్బందికి ధన్యవాదాలు. అలాగే ఈ వాక్సినేషన్‌ ప్రక్రియను ఎంతో నిబద్ధతతో.. సమర్థవంతంగా నిర్వర్తిస్తున్న అహ్మదాబాద్‌ అపోలో ఆస్పత్రి వైద్య బృందానికి అభినందనలు’ అని శాస్త్రి పేర్కొన్నాడు.

ఇక సోమవారం నుంచి దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ వాక్సిన్‌ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్రమోదీ సైతం నిన్ననే దిల్లీలోని ఎయిమ్స్‌లో వాక్సినేషన్‌ చేయించుకున్నారు. ఈ క్రమంలోనే తొలిరోజు టీకా వేసుకునేందుకు పెద్ద సంఖ్యలో జనం ఆసక్తి చూపారు. నిన్న ఒక్కరోజు రాత్రి వరకు సుమారు 29 లక్షల మంది వాక్సినేషన్‌ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నట్లు కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ తెలిపారు. కాగా, టెస్టు సిరీస్‌ కోసం అహ్మదాబాద్‌లో ఉన్న రవిశాస్త్రి అక్కడే కొద్దిసేపటి క్రితం టీకా వేయించుకున్నాడు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని