Ravi Shastri: శాస్త్రికే కాదు భరత్‌, శ్రీధర్‌కూ కరోనా.. మాంచెస్టర్‌ టెస్టుకు దూరం - ravi shastri tests positive in rt-pcr along with arun sridhar trio not going to manchester
close
Published : 06/09/2021 23:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Ravi Shastri: శాస్త్రికే కాదు భరత్‌, శ్రీధర్‌కూ కరోనా.. మాంచెస్టర్‌ టెస్టుకు దూరం

లండన్‌: టీమ్‌ఇండియా కోచ్‌ రవిశాస్త్రికి ఆర్‌టీ పీసీఆర్‌ టెస్టులోనూ పాజిటివ్‌ వచ్చింది. అతడితో సన్నిహితంగా మెలిగిన భరత్‌ అరుణ్‌, శ్రీధర్‌, నితిన్‌కు సైతం పరీక్షలు చేయగా.. భరత్‌, శ్రీధర్‌కు పాజిటివ్‌ వచ్చిందని తెలిసింది. దాంతో వారు ఐదో టెస్టుకు అందుబాటులో ఉండరు. ఎందుకంటే వారు కనీసం పది రోజులు ఐసోలేషన్‌లో ఉండాలి. ఐపీఎల్‌ కోసం బీసీసీఐ మాంచెస్టర్‌లో ప్రత్యేక బుడగ ఏర్పాటు చేయనుండటంతో వారు అక్కడికి వెళ్లరు.శనివారం రాత్రి ఎనిమిది గంటలకు శాస్త్రికి కరోనా టెస్టు చేశారు. కాస్త నలతగా అనిపించడంతో ర్యాపిడ్‌ టెస్టు చేశారు. అందులో పాజిటివ్‌గా తేలడంతో వెంటనే ఐసోలేషన్‌కు పంపించారు. అతడితో సన్నిహితంగా మెలిగిన బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌, ఫీల్డింగ్‌ కోచ్‌ శ్రీధర్‌, ఫిజియో నితిన్‌ పటేల్‌ను ఐసోలేషన్‌లో ఉంచారు. కచ్చితత్వం కోసం ఆదివారం శాస్త్రితో పాటు మిగతా ముగ్గురికీ ఆర్‌టీ పీసీఆర్‌ పరీక్షలు చేయించారు. ఆ రిపోర్టులు సోమవారం అందాయి. సెప్టెంబర్‌ 10 నుంచి ఐదో టెస్టు ఆరంభం కానుంది.

‘రెండు ర్యాపిడ్‌ టెస్టుల్లో పాజిటివ్‌ వచ్చిన తర్వాత కచ్చితత్వం కోసం శాస్త్రికి ఆర్‌టీ పీసీఆర్‌ చేయించాం. అందులోనూ అతడికి పాజిటివ్‌ వచ్చింది. ప్రస్తుతం అతడు స్వల్ప గొంతునొప్పితో బాధపడుతున్నాడు. పది రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండనున్నాడు’ అని బీసీసీఐ అధికారి ఒకరు పీటీఐకి తెలిపారు. 

‘ఐదో టెస్టు మ్యాచ్‌ సెప్టెంబర్‌ 10నే మొదలవుతోంది కాబట్టి రవిశాస్త్రి జట్టుతో పాటు వెళ్లడు. మాంచెస్టర్‌ టెస్టు ముగిశాకే అతడి ఐసోలేషన్‌ ముగుస్తుంది’ అని ఆ అధికారి వెల్లడించారు. ముందుగా నిర్ణయించిన మేరకు భరత్‌ అరుణ్‌, శ్రీధర్‌, నితిన్‌ మాంచెస్టర్‌కు వెళ్లరు. ‘రవిశాస్త్రితో సన్నిహితంగా మెలగడంతో వారు కనీసం ఐదు రోజులు క్వారంటైన్‌లో ఉండాలి. ఏదేమైనా వారు ఆఖరి టెస్టుకు అందుబాటులో ఉండరు. ఎందుకంటే మాంచెస్టర్లో బీసీసీఐ ప్రత్యేకంగా ఐపీఎల్‌ కోసం బయో బుడగ ఏర్పాటు చేస్తుంది. అక్కడే బుడగ నుంచి బుడగకు బదిలీలు ఉంటాయి’ అని ఆ అధికారి తెలిపారు.

ఐదో టెస్టుకు బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాఠోడ్‌ బాధ్యతలు తీసుకుంటారు. ఆటగాళ్ల శిక్షణ, సాధనకు అవసరమైన అదనపు వనరులు ఉన్నాయి. శిక్షకులూ ఉన్నారు. కాగా తన బుక్‌ విడుదల చేసినప్పుడు హోటల్లోనో, ఓవల్‌ మైదానం కామన్‌ లిఫ్టులోనో శాస్త్రికి వైరస్‌ సోకొచ్చని అనుమానిస్తున్నారు. ఎందుకంటే ఆ లిఫ్టులో కనీసం 5వేల మంది వెళ్లిఉంటారని అంచనా!



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని