లాయర్‌ పాత్రలో రవితేజ! - ravi teja in the role of a lawyer!
close
Published : 24/03/2021 19:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

లాయర్‌ పాత్రలో రవితేజ!

ఇంటర్నెట్‌ డెస్క్: రవితేజ సహాయనటుడిగా, నటుడిగా ఒక్కో మెట్టు ఎక్కుతూ స్వయంకృషితో తెలుగు చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఈ ఏడాది ఆరంభంలో ‘క్రాక్‌’ చిత్రంతో విజయం సాధించిన రవితేజ, ఇప్పుడు కొత్త చిత్రాలతో బిజీ అయ్యారు. ప్రస్తుతం ఆయన రమేష్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఖిలాడి’ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో రవితేజ సరసన కథానాయికలుగా మీనాక్షి చౌదరి, డింపుల్ హయతీలు నటిస్తున్నారు. కోనేరు సత్యనారాయణ నిర్మాత. ఈ చిత్రం తర్వాత రవితేజ - నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ‘ఆర్టీ68’ వర్కింగ్‌ టైటిల్‌గా ఓ సినిమా చేస్తున్నారు. ఇందులో ఆయన లాయర్‌ పాత్రలో కనిపించనున్నారని సమాచారం. ఈ చిత్రంలోనూ ముగ్గురు కథానాయికలు నటించనున్నారట. వీరిలో శ్రీలీలా, లవ్లీ సింగ్‌ ఉన్నారు. ఇందులో మరో  కథానాయికగా ‘జాతిరత్నాలు’ ఫేం ఫరియా అబ్దుల్లాను తీసుకోనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని