Ravi teja khiladi: ఓటీటీలో వస్తుందా? - ravi teja khiladi movie streaming in ott
close
Published : 14/05/2021 17:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Ravi teja khiladi: ఓటీటీలో వస్తుందా?

ఇంటర్నెట్ డెస్క్: రవితేజ కథానాయకుడిగా రమేష్ వర్మ దర్శకత్వంలో వస్తోన్న చిత్రం ‘ఖిలాడి’. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న  ఈ సినిమా విడుదలను వాయిదా వేసినట్లు చిత్రబృందం ప్రకటించింది. ‘‘ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న కరోనా క్లిష్ట పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని సినిమా విడుదలను కొంతకాలం వాయిదా వేస్తున్నాం. కరోనా పరిస్థితులు చక్కబడిన వెంటనే కొత్త విడుదల తేదీని వెల్లడిస్తామని’’ తెలిపింది. అయితే తాజాగా ఈ సినిమాని ఓటీటీలో విడుదల చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారని సమాచారం. చిత్రానికి సంబంధించిన ప్రసార హక్కులను అమెజాన్ ప్రైమ్ దక్కించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై చిత్రబృందం ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

పెన్ స్టూడియోస్‌, ఎ స్టూడియోస్ ఎల్ఎల్పీ కలిసి నిర్మిస్తున్న చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. కథానాయికలుగా డింపుల్‌ హయాతీ, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. ఇందులో అర్జున్, ఉన్ని ముకుందన్, నికితిన్ ధీర్, సచిన్ ఖేడ్కర్‌, మురళీ శర్మ, వెన్నెల కిషోర్, అనసూయ, ఠాకూర్ అనూప్ సింగ్ తదితరులు ఇతర పాత్రల్లో కనిపిస్తున్నారు. సుజిత్ వాసుదేవ్, జి.కె.విష్ణు సినిమాటోగ్రాఫర్లు‌గా పనిచేశారు. సత్యనారాయణ కోనేరు, రమేష్ వర్మ పెన్మెత్స నిర్మాతలు. 




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని