ఏప్రిల్ 12న 'ఖిలాడి' టీజర్  విడుదల   - ravi teja khiladi teaser to be released on april 12
close
Published : 09/04/2021 14:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

 ఏప్రిల్ 12న 'ఖిలాడి' టీజర్  విడుదల  

ఇంటర్నెట్‌ డెస్క్: ‘క్రాక్‌’ సినిమా విజయంతో దూకుడు మీదున్న మాస్‌ హీరో రవితేజ నటిస్తున్న కొత్త చిత్రం ‘ఖిలాడి’. రమేష్‌ వర్మ దర్శకత్వంలో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న చిత్రాన్ని పెన్ స్టూడియోస్‌, ఎ స్టూడియోస్ ఎల్ఎల్పీ కలిసి నిర్మిస్తున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం  సమకూరుస్తున్నారు. తన 67వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా టీజర్‌ని ఏప్రిల్‌ 12న విడుదల చేస్తున్నట్లు రవితేజ తన ట్విటర్‌లో వెల్లడించారు. ఇందులో డింపుల్‌ హయాతీ, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటిస్తున్నారు. అర్జున్, ఉన్ని ముకుందన్, నికితిన్ ధీర్, సచిన్ ఖేడెకర్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్, అనసూయ, ఠాకూర్ అనూప్ సింగ్ తదితరులు ఇతర పాత్రల్లో కనిపిస్తున్నారు. సినిమాకి సంబంధించి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ఫస్ట్‌ గ్లింప్స్‌ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇక రాబోయే ఈ  టీజర్ మరింతగా అభిమానులను ఆకట్టుకోనుందని చిత్రబృందం ఆశిస్తోంది. సినిమాకి సుజిత్ వాసుదేవ్, జి.కె.విష్ణు సినిమాటోగ్రాఫర్లు‌గా పనిచేస్తున్నారు. సత్యనారాయణ కోనేరు, రమేష్ వర్మ పెన్మెత్స నిర్మాతలు. మే 28న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. గతంలో రవితేజ.. రమేష్‌ వర్మ దర్శకత్వంలో ‘వీర’ అనే చిత్రం చేశారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని