రవితేజ ‘క్రాకింగ్‌ క్లైమాక్స్‌ ఫైట్‌’ చూశారా? - ravi teja krack movie climax fight
close
Published : 03/04/2021 23:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రవితేజ ‘క్రాకింగ్‌ క్లైమాక్స్‌ ఫైట్‌’ చూశారా?

హైదరాబాద్‌: రవితేజ కథానాయకుడిగా గోపిచంద్‌ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘క్రాక్‌’. శ్రుతి హాసన్‌ కథానాయిక. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. మాస్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా రవితేజ ఎనర్జీ, ప్రతినాయకుడిగా సముద్రఖని నటనతో పాటు శ్రుతిహాసన్‌ ట్విస్ట్‌ ఫైట్‌ సినిమాను మరోస్థాయిలో నిలబెట్టాయి.

ఇక జయమ్మ వరలక్ష్మి శరత్‌కుమార్‌ ఒదిగిపోయిన తీరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీటన్నింటితో పాటు గోపిచంద్‌ మలినేని సినిమాను తీర్చిదిద్దిన విధానం అందరికీ నచ్చింది. ‘క్రాక్‌’లో క్లైమాక్స్‌ ఫైట్‌ మాస్‌ను మెప్పించింది. ప్రస్తుతం ఆహాలో సినిమా స్ట్రీమింగ్‌ అవుతోంది. ఈ సందర్భంగా ‘క్రాకింగ్‌ ఫైట్‌’ అంటూ ఆ వీడియోను ఆహా పంచుకుంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని