‘క్రాక్‌’ శంకర్‌ కాస్త ముందుగానే వస్తున్నాడు - ravi teja krack movie will release on january 9th
close
Published : 03/01/2021 01:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘క్రాక్‌’ శంకర్‌ కాస్త ముందుగానే వస్తున్నాడు

హైదరాబాద్‌: ‘షూర్‌ షాట్‌.. నో డౌట్‌.. పుచ్చ పేలిపోద్ది’ అంటూ మాస్‌ డైలాగ్‌తో ట్రెండ్‌ సృష్టిస్తున్నాడు మాస్‌ మహారాజ్‌ రవితేజ. ఆయన కథానాయకుడిగా గోపిచంద్‌ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘క్రాక్‌’. శ్రుతిహాసన్‌ కథానాయిక. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సెన్సార్‌ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్‌ ఇచ్చింది.

సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేయాలని చిత్ర బృందం తొలుత భావించింది. అయితే, ఇంకాస్త ముందుగానే పోతరాజు శంకర్‌ థియేటర్లలో సందడి చేయనున్నాడు. జనవరి 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసురానున్నట్లు తాజాగా ప్రకటించారు. తమన్‌ స్వరాలు సమకూరుస్తున్న ఈ సినిమాను బి.మధు నిర్మిస్తున్నారు. రవితేజ ‘క్రాక్‌’ రాకతో సంక్రాంతి సందడి కాస్త ముందుగానే మొదలుకానుంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని