అలాంటివారికి N95 మాస్కులు అందజేస్తా! - ravichandran ashwin came forward to donate n95 masks for those who cant afford to buy
close
Published : 08/05/2021 01:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అలాంటివారికి N95 మాస్కులు అందజేస్తా!

వాక్సిన్‌ వచ్చే వరకూ వేచిచూడండి: అశ్విన్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశంలో కరోనా రెండో దశ తీవ్రత వేగంగా ఉన్న నేపథ్యంలో ప్రజలంతా సురక్షితంగా ఉండాలని టీమ్‌ఇండియా క్రికెటర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అభిలాషించాడు. ఈ క్రమంలోనే ప్రతిఒక్కరూ వాక్సిన్‌ వేయించుకోవాలని, ఇతరులకు దూరంగా ఉండాలని కోరాడు. అలాగే ప్రజలంతా రెండు మాస్కులు ధరించాలని, దుస్తులతో చేసిన వాటిని వాడకూడదని సూచించాడు. అయితే, దీనికి ఇద్దరు నెటిజన్ల నుంచి అనూహ్య స్పందన వచ్చింది.

తొలుత ఒక వ్యక్తి కామెంట్‌ చేస్తూ ‘‘ఒక N95 మాస్క్‌ కొనాలంటే రూ.70గా ఉంది, అదే ఒక సర్జికల్‌ మాస్క్‌ అయితే రూ.10. దీన్ని 8 గంటల కన్నా ఎక్కువ ఉపయోగించలేము. అలాంటిది తినడానికి తిండి లేనివారు, అల్పాదాయ ప్రజలు మాస్కులు ఎలా కొంటారు?దీనికి పరిష్కారం చూపగలరా?’’ అని అడిగాడు. దీనికి స్పందించిన అశ్విన్‌ అలాంటి వారికోసం తానే స్వయంగా కొనిపెడతాడతానని, కాకపోతే వాటిని ఎలా పంచిపెట్టాలో తెలియజేయాలని విజ్ఞప్తి చేశాడు.

మరోవ్యక్తి ఇంకో కామెంట్‌ చేస్తూ ‘‘నా రెండో డోసు వాక్సినేషన్‌ తీసుకోవడానికి మే 21 చివరి తేది. కానీ, ఇప్పటివరకు వాక్సినేషన్‌ కేంద్రమే లేదు’’ అని తన బాధను వెళ్లగక్కాడు. దానికి స్పందించిన అశ్విన్‌ ఇలా సమాధానమిచ్చాడు. ‘‘వాక్సినేషన్‌ మీకు చేరేంతవరకు వేచిచూడమనే నేను చెప్పగలను. మన దేశంలో వంద కోట్ల జనాభా కంటే ఎక్కువగా ఉన్నారు. వాక్సినేషన్‌ తీసుకునే వరకూ జాగ్రత్తగా ఉండండి’’ అని రీట్వీట్‌ చేశాడు. ఇదిలా ఉండగా, ఇటీవల దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని