Cricket News: అశ్విన్‌పై నిషేధం పడకుండా రక్షించారు - ravichandran ashwin kept away from cricket for six months to save him from ban says saeed ajmal
close
Published : 15/06/2021 12:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Cricket News: అశ్విన్‌పై నిషేధం పడకుండా రక్షించారు

ఇంటర్నెట్‌ డెస్క్‌: రవిచంద్రన్‌ అశ్విన్‌పై ఆరు నెలల నిషేధం పడకుండా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉంచారని పాక్‌ మాజీ స్పిన్నర్‌ సయీద్‌ అజ్మల్‌ అన్నాడు. ఆ సమయంలో అనుమానిత బౌలింగ్‌ యాక్షన్‌ను అతడు సరిచేసుకున్నాడని పేర్కొన్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో బ్యాట్స్‌మన్‌, పేసర్లకు అనుకూలంగా నిబంధనలు ఉన్నాయని ఆరోపించాడు. భుజం 15 డిగ్రీలు వంపు తిరగాల్సిందేనంటూ స్పిన్నర్లపై ఆంక్షలు పెడుతున్నారని వెల్లడించాడు. అజ్మల్‌ ఒకప్పుడు ఇలాంటి నిషేధాన్ని ఎదుర్కోవడం గమనార్హం.

‘ఎవర్నీ సంప్రదించకుండానే అన్ని నిబంధనలూ మార్చేస్తారు. గత ఎనిమిదేళ్లుగా క్రికెట్‌ ఆడుతూనే ఉన్నా. ఆ నిబంధలన్నీ నాకే వర్తించాయి. అదే సమయంలో అశ్విన్‌ ఆరు నెలలు క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. ఎందుకు? ఎందుకంటే ఆ బౌలర్‌పై నిషేధం పడకుండా బీసీసీఐ కాపాడింది. పాక్‌లో ఏ బౌలర్‌పై నిషేధం పడ్డా పట్టించుకోరు. వారికి డబ్బే ముఖ్యం’ అని అజ్మల్‌ అన్నాడు.

దూస్రాలు విసిరేందుకు ఐసీసీ 15 డిగ్రీల నిబంధనను పక్కన పెట్టాలని అశ్విన్‌ కోరినట్టు ఈ మధ్యే వార్తలు రావడం గమనార్హం. తానెప్పుడూ అలా కోరలేదని, అవన్నీ అవాస్తవాలని యాష్‌ స్పష్టం చేశాడు. తన యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా అభిమానులకు సరైన అంశాలు, మెరుగైన క్రికెట్‌ విశ్లేషణ అందించడమే లక్ష్యమని పేర్కొన్నాడు. అనువాదం సరిగ్గా రానప్పుడు తప్పుడు వార్తలు రాయొద్దని సూచించాడు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని