భగవంతుడా కాస్తా దయ చూపించు: అశ్విన్ - ravichandran ashwin shares emotional post as india continues to record over 3 lakh covid-19 cases
close
Published : 13/05/2021 01:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భగవంతుడా కాస్తా దయ చూపించు: అశ్విన్

ఇంటర్నెట్ డెస్క్‌: దేశం కరోనా సంక్షోభంలో చిక్కుకున్నప్పటి నుంచి సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటున్న టీమిండియా బౌలర్‌ రవిచంద్రన్ అశ్విన్‌.. ప్రతి ఒక్కరూ మాస్క్‌లు ధరించి సురక్షితంగా ఉండాలని సూచనలిస్తున్నాడు. సూచనలకే పరిమితం కాకుండా ఎన్95 మాస్క్‌లు కొనుగోలు చేసే స్థోమత లేనివారికి ఉచితంగా పంపిణీ చేస్తానని ఈ మధ్యే సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించాడు. 

దేశంలో కొవిడ్ విజృంభణను దృష్టిలో ఉంచుకుని అశ్విన్ తాజాగా భావోద్వేగపూరితమైన సందేశాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నాడు.‘ఈ సంక్షోభమంతా ముగిసిన తర్వాత నన్ను లేపండి. ఇంకా ఎంతమంది ప్రజలు చనిపోవాలి. ఈ విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకోండి. దయచేసి మాస్క్‌ ధరించండి. సామాజిక దూరం పాటించకపోవడం త్వరలో నేరంగా మారవచ్చు. దేవుడా కాస్తా దయ చూపించు’ అని ట్వీట్ చేశాడు.

జూన్‌ 18-22 మధ్య సౌథాంప్టన్‌ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్‌ జరగనుంది. అనంతరం ఇంగ్లాండ్‌తో భారత్ ఐదు టెస్టు మ్యాచులు ఆడనుంది. ఇందు కోసం బీసీసీఐ ఇటీవల జట్టులో కూడా ప్రకటించింది. దీంట్లో రవిచంద్రన్‌ అశ్విన్‌ కూడా చోటు దక్కింది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని