Covid 19: టీకా వేయించుకున్న రవీంద్ర జడేజా - ravindra jadeja and his wife rivaba takes first dose of covid-19 vaccine in rajkot
close
Published : 14/05/2021 19:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Covid 19: టీకా వేయించుకున్న రవీంద్ర జడేజా

(photo: Ravindra Jadeja Twitter)


ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా క్రికెటర్లు కొవిడ్-19 టీకాలను వేయించుకుంటున్నారు. ఇప్పటికే విరాట్ కోహ్లి, రిషభ్‌ పంత్, అజింక్యా రహానే, శిఖర్ ధావన్, ఇషాంత్ శర్మ, అతని భార్య ప్రతిమ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, దీపక్‌ చాహర్‌, సిద్ధార్థ్ కౌల్‌,  టెస్టు స్పెషలిస్టు ఛతేశ్వర్‌ పూజారా, అతని భార్య పూజా, ఉమేశ్‌ యాదవ్‌ కొవిడ్ 19 మొదటి డోసు తీసుకున్నారు. 

తాజాగా ఈ జాబితాలోకి  ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా చేరాడు. శుక్రవారం జడేజా రాజ్‌కోట్‌లో కొవిడ్ 19 తొలి డోసు టీకా వేయించుకున్నాడు. అతని భార్య రివాబా జడేజా కూడా వ్యాక్సిన్‌ తీసుకున్నారు. దేశ ప్రజలంతా కలిసి కట్టుగా ఉంటేనే కరోనాపై విజయం సాధిస్తామని, దయచేసి అందరూ ఇంట్లోనే ఉంటూ జాగ్రత్తగా ఉండండి’ అంటూ జడేజా ఇటీవల సామాజిక మాధ్యమాల ద్వారా కోరాడు.

ఇక, సౌథాంప్టన్ వేదికగా జూన్‌ 18-22 మధ్య భారత్‌, న్యూజిలాండ్ మధ్య ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ షిప్‌(డబ్ల్యూటీసీ) ఫైనల్ జరగనుంది. అనంతరం టీమిండియా ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టులు ఆడనుంది. ఈ పర్యటనకు బీసీసీఐ ఇప్పటికే 20మందితో కూడిన జట్టును ప్రకటించింది. దీంట్లో రవీంద్ర జడేజాకు కూడా చోటు దక్కింది. ఈ సిరీస్‌ రాణించి టీమిండియాను విజేతగా నిలపాలనే జడేజా గట్టి పట్టుదలతో ఉన్నాడు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని