కలిసికట్టుగా ఉంటేనే కరోనాపై విజయం: జడ్డూ - ravindra jadeja requests fans to help each other and fight against covid 19 in this difficult times
close
Published : 08/05/2021 01:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కలిసికట్టుగా ఉంటేనే కరోనాపై విజయం: జడ్డూ

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశ ప్రజలంతా కలిసి కట్టుగా ఉంటేనే కరోనాపై విజయం సాధిస్తామని టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా పేర్కొన్నాడు. ప్రస్తుతం భారత దేశాన్ని కొవిడ్‌-19 సెకండ్‌ వేవ్‌ తీవ్రంగా భయపెడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జడేజా శుక్రవారం ఓ వీడియోలో మాట్లాడుతూ ప్రజలను సురక్షితంగా ఉండమని చెబుతూనే తోటి వారికి సహాయం చేయాలని కోరాడు.

‘దయచేసి అందరూ ఇంట్లోనే ఉంటూ జాగ్రత్తగా ఉండండి. దాంతో మీరూ, మీ కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉంటారు. అలాగే ఇలాంటి విపత్కర సమయంలో అందరూ కలిసికట్టుగా ఉండి కరోనాతో పోరాడాలి. కాబట్టి దయచేసి మాస్కులు ధరిస్తూ తరచూ చేతులు శానిటైజ్‌ చేసుకోండి. ఏదైనా అవసరమైతే మీ చుట్టు పక్కలున్న వారికి కూడా సహాయం చేయండి. కొన్నిసార్లు ఏదైనా సహాయం అడగాలంటే కొంతమంది మొహామాటం పడతారు. మీరే చొరవ తీసుకొని ఏదైనా కావాలా అని అడిగి తెలుసుకోండి. మనమంతా కలిసికట్టుగా ఉంటేనే ఈ మహమ్మారిపై విజయం సాధిస్తాము’ అని జడేజా చెప్పుకొచ్చాడు. కాగా ఈ వీడియోను చెన్నై సూపర్‌ కింగ్స్‌ ట్వీట్‌ చేయడంతో వేల మంది నుంచి మంచి స్పందన వచ్చింది.

మరోవైపు కరోనా కేసుల కారణంగా ఇటీవల ఐపీఎల్‌ 14వ సీజన్‌ వాయిదా వేసిన సంగతి తెలిసిందే. పలువురు ఆటగాళ్లు వైరస్‌ బారిన పడటంతో బీసీసీఐ, ఐపీఎల్‌ పాలక మండలి సంయుక్త నిర్ణయం తీసుకున్నాయి. ఇక ఈ సీజన్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఐదు విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. టోర్నీని వాయిదా వేయడంతో ఆటగాళ్లంతా స్వస్థలాలకు వెళ్లిపోయారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని