‘ఖిలాడి’ గేమ్‌లోకి మలయాళీ హీరో! - raviteja khiladi movie unnimukundan join in team
close
Updated : 01/02/2021 16:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ఖిలాడి’ గేమ్‌లోకి మలయాళీ హీరో!

హైదరాబాద్‌: రవితేజ హీరోగా ‘ఖిలాడి’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. డింపుల్‌ హయాతి, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలోని ఒక ప్రధాన పాత్రలో మాలీవుడ్‌ యువ నటుడు ఉన్ని ముకుందన్‌ కనిపించనున్నారు. ఈ మేరకు చిత్ర దర్శకుడు రమేష్‌వర్మ ట్విటర్‌ ద్వారా తెలిపారు.

ఉన్ని ముకుందన్‌ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. ఎన్టీఆర్‌ నటించిన ‘జనతా గ్యారేజ్‌’తో పాటు అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ‘భాగమతి’లో కీలకపాత్ర పోషించాడు. రవితేజ ఇందులో ద్విపాత్రిభినయం చేస్తున్నారు. మరోవైపు యాక్షన్‌కింగ్‌ అర్జున్‌ కూడా ఈ చిత్రంలో భాగమైన సంగతి తెలిసిందే. రమేష్‌వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పెన్‌ స్టూడియోస్‌ పతాకంపై కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. దేవీశ్రీప్రసాద్‌ సంగీతం సమకూరుస్తున్నారు. మే 28న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.

ఇవీ చదవండి!

సోనూ షో ఆఫ్‌.. నాగబాబు గీసిన బొమ్మ

‘ఉనికి’ పోస్టర్‌ విడుదల
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని