RT68: రవితేజ కొత్త చిత్రం మొదలైంది - raviteja new film under direction of sarat mandava shoot started
close
Published : 01/07/2021 15:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

RT68: రవితేజ కొత్త చిత్రం మొదలైంది

ఇంటర్నెట్‌ డెస్క్‌: శరత్‌ మండవ దర్శకత్వంలో రవితేజ ఓ చిత్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘ఆర్‌.టి. 68’ వర్కింగ్‌ టైటిల్‌తో ఎస్‌.ఎల్‌.వి. సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. దివ్యాంశ కౌశిక్‌ కథానాయిక. హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో గురువారం ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. ఈ మేరకు ఓ ఫొటోని విడుదల చేసింది చిత్ర బృందం. ఇందులో ఎగ్జిక్యూటివ్‌ మెజిస్ట్రేట్‌ కార్యాలయంలో కూర్చుని కనిపించారు రవితేజ. వాస్తవ సంఘటన ఆధారంగా థ్రిల్లర్‌ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకి సంగీతం: శ్యామ్‌ సి.ఎస్‌, ఛాయాగ్రహణం: సత్యన్‌ సూర్యన్‌. టైటిల్‌ ఇంకా ఖరారు కాలేదు. మరోవైపు రవితేజ నటిస్తోన్న ‘ఖిలాడి’ తుదిదశకు చేరుకుంది. రమేశ్‌ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. డింపుల్‌ హయాతీ, మీనాక్షి చౌదరి నాయికలు. వీటితోపాటు మరికొన్ని కథల్ని వింటున్నారాయన.


 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని