‘ఖిలాడి’ థియేటర్లలోకి ఎప్పుడంటే? - raviteja new movie khiladi release update
close
Published : 30/01/2021 17:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ఖిలాడి’ థియేటర్లలోకి ఎప్పుడంటే?

హైదరాబాద్‌: మాస్‌ మహారాజ్‌ రవితేజ హీరోగా ‘ఖిలాడి’ చిత్రం తెరకెక్కుతోంది. ‘ప్లే స్మార్ట్‌’ అనేది ఉపశీర్షిక. రవితేజతో కలిసి గతంలో ‘వీర’ను తెరకెక్కించిన రమేశ్‌వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకొంటున్న ఈ చిత్రం మే 28న ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు చిత్రబృందం తెలిపింది. ఇదే విషయాన్ని దర్శకుడు రమేశ్‌వర్మ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ఈ సంక్రాంతికి వచ్చిన ‘క్రాక్‌’ సినిమాతో రవితేజ బంపర్‌హిట్‌ కొట్టి మంచి జోరు మీద ఉన్నారు. ఖిలాడిలో యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ ఈ చిత్రంలో ఓ కీలకపాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దేవీశ్రీప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తుండగా పెన్‌ స్టూడియోస్‌ పతాకంపై కోనేరు సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే విడుదలైన రవితేజ ఎంట్రీ గ్లింప్స్‌ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది!

ఇవీ చదవండి!

‘ఖిలాడి’టీమ్‌లో యాక్షన్‌ కింగ్‌!

#NTR30: హీరోయిన్‌ ఈమేనా?
మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని