IPLపై కరోనా పడగ: KKR v RCB మ్యాచ్‌ వాయిదా - rcbbangalora ipl match cancelled9
close
Updated : 03/05/2021 14:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

IPLపై కరోనా పడగ: KKR v RCB మ్యాచ్‌ వాయిదా

సందీప్‌ వారియర్‌, వరుణ్‌ చక్రవర్తికి పాజిటివ్‌

హైదరాబాద్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌కు ఎదురుదెబ్బ! తాజా సీజన్‌పై కరోనా కోరలు చాచినట్టు కనిపిస్తోంది. సోమవారం రాత్రి కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్‌ వాయిదా పడింది. కోల్‌కతా జట్టులో వరుణ్‌ చక్రవర్తి, సందీప్‌కు వారియర్‌కు కరోనా వైరస్‌ సోకడమే ఇందుకు కారణం.  ఈ విషయంపై  ఐపీఎల్‌,  కేకేఆర్‌ యాజమాన్యాలు సోమవారం మధ్యాహ్నం ప్రకటించాయి.

సోమవారం జరగాల్సిన మ్యాచ్‌ సంఖ్య 30. అహ్మదాబాద్‌ వేదిక. దీనిని రీషెడ్యూలు చేయనున్నారు.  వాస్తవంగా వరుణ్ చక్రవర్తి, సందీప్‌ వారియర్‌ గాయపడ్డారు. వారిని స్కానింగ్‌ కోసం ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయిందని తెలుస్తోంది. కాగా ఇక నుంచి కోల్‌కతా శిబిరంలోని ఆటగాళ్లకు ప్రతి రోజూ ఆర్‌టీపీసీఆర్‌ టెస్టులు చేయనున్నారు. ఆ ఇద్దరితో 48 గంటల క్రితం సన్నిహితంగా మెలిగిన వారి నమూనాలను కూలంకషంగా పరీక్షించనున్నారు. ప్రస్తుతానికైతే మిగతావారికి నెగెటివ్‌ వచ్చిందని ఐపీఎల్‌ పాలక మండలి తెలిపింది.  ఆ ఇద్దరు ఆటగాళ్ల నుంచి ఇంకెవరికైనా వైరస్‌ సోకితే లీగ్‌ నిర్వహణ కష్టమే!



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని